eye twitching superstition – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com MeArogyam Thu, 16 Dec 2021 06:51:01 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.3 https://mearogyam.com/wp-content/uploads/2021/11/cropped-mearogyam-favicon-1-32x32.png eye twitching superstition – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com 32 32 Eye Twitching Superstition : కన్ను అదురుతుందా? ఏమైనా కీడు జరుగుతుందా? https://mearogyam.com/spiritual-news/eye-twitching-superstition-eye-twitching-reasons.html https://mearogyam.com/spiritual-news/eye-twitching-superstition-eye-twitching-reasons.html#respond Sun, 17 Oct 2021 03:30:00 +0000 https://mearogyam.com/?p=442 Eye Twitching Superstition : కన్ను అదురుతుందా? ఏమైనా కీడు జరుగుతుందా?
MeArogyam Health News Telugu - MeArogyam.com

చాలామందికి కన్ను అదరుతుందని చెబుతుంటారు. కన్ను అదరడం మంచిది కాదని అంటుంటారు. అది కూడా ఏ కన్ను అదిరితే మంచిది..

The post Eye Twitching Superstition : కన్ను అదురుతుందా? ఏమైనా కీడు జరుగుతుందా? appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
Eye Twitching Superstition : కన్ను అదురుతుందా? ఏమైనా కీడు జరుగుతుందా?
MeArogyam Health News Telugu - MeArogyam.com

Eye twitching superstition : చాలామందికి కన్ను అదరుతుందని చెబుతుంటారు. కన్ను అదరడం మంచిది కాదని అంటుంటారు. అది కూడా ఏ కన్ను అదిరితే మంచిది.. ఏ కన్ను అదిరిది కీడు అంటే.. ఆడ, మగవారిలో ఒక్కోరకంగా ఉంటుందని అంటారు. ఇంతకీ కన్ను అదరడానికి కారణాలు ఏంటి? కన్ను అదరడం ద్వారా జరగబోయే కీడును ముందుగానే హెచ్చరిస్తున్నట్టా? కన్ను అదరడంపై సైన్స్ ఏం చెబుతుందో తెలుసుకుందాం..

మీ కన్ను అదరడం ఎప్పుడైనా గమనించారా? కన్ను అదిరితే ఏ కన్ను అదురుతోంది.. ఆడవారికి కుడి కన్ను అదిరితే కీడు అంటారు. అలాగే మగవారికి ఎడమ కన్ను అదిరితే కీడు అంటారు. ఒకవేళ ఆడవారికి ఎడమ కన్ను అదిరితే మంచిదని భావిస్తారు. అలాగే మగవారికి కుడి కన్ను అదిరితే చాలా మంచిదని భావిస్తారు.

కన్ను అదరడమనేది కొంతసేపు అదరుతుంటాయి. కాసేపు ఆగి మళ్లీ కన్నులు అదురుతుంటాయి. అలా కొన్నిరోజులు వరకు అలానే ఉండొచ్చు. ఇలా కన్ను అదిరినప్పుడు చాలామంది వామ్మో తమకు ఏదో కీడు జరుగబోతుందని ఆందోళన చెందుతుంటారు. భయపడిపోతుంటారు. ఈ నమ్మకాలు, విశ్వాసాలు ఎప్పటినుంచో ఉంటున్నాయి.

రావణాసురుడు సీతాదేవిని అపహరించడానికి ముందు ఆమెకు కుడికన్ను అదిరిందంట.. అలాగే లక్ష్మణుడికి ఎడమకన్ను అదిరిందట.. రాముడు లంకలోకి అడుగుపెట్టిన సమయంలో రావణుడికి ఎడమకన్ను.. సీతకు కుడికన్ను అదిరాయట. రామదండు లంకలోకి యుద్ధానికి రాగానే మండోదరితో పాటు రావణుడికి కన్నులు అదిరాయట. అప్పటినుంచే కన్ను అదరడమనేది శకునాలుగా భావిస్తున్నారు.

ఎడమకన్ను అదిరితే :
ఎడమకన్ను అదిరితే ఓ అపరిచితుడు జీవితంలోకి వస్తాడు.. అదే కుడి కన్ను అదిరితే… తమ ఇంట్లో లేదా బంధువుల ఇళ్లలో శిశువు జన్మిస్తుందని నమ్ముతారు.

కన్ను పైరెప్ప అదిరితే :
కన్ను పైరెప్ప అదిరితే బంధువులు వస్తారంటారు. అదే కిందిరెప్ప అదిరితే కన్నీళ్ల కుండపోతగా భావిస్తారు. మధ్యాహ్నం ఒకటి నుంచి 3 గంటల మధ్య కన్నులు అదిరితే కష్టాలు తప్పవట. అదే మధ్యాహ్నం ఒకటి నుంచి మూడు గంటల మధ్య అదిరితే కష్టాలు వస్తాయని నమ్ముతారు. 3 గంటల నుంచి 5 గంటల మధ్య సమయంలో అతిథులు వస్తారని నమ్ముతుంటారు. అదే కనుబొమ్మ అదిరితే మిత్ర లాభంగా చెబుతారు. కంటికింద బాగం అదిరితే విజయానికి చిహ్నాంగా పిలుస్తారు.

సైన్స్ పరంగా పరిశీలిస్తే..
కన్నులు అదరడమనేది.. అనారోగ్యానికి సూచనగా చెప్పవచ్చు. కళ్లు గంటల తరబడి అదరడం అనారోగ్యానికి గుర్తుగా పరిగణించాలి. కంటినిండా నిద్ర లేకపోయినా ఇలాంటి సమస్య ఎదురవుతుంది. కళ్లు అలసిపోయినా, విటమిన్ల లోపం, నరాల బలహీనతతో పాటు కంటి సంబంధిత సమస్యల వల్ల కూడా కన్నులు అదరడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. మెదడు- నాడీవ్యవస్థలో సమస్యలతో కూడా కన్నులు అదరడానికి సంబందం ఉందంటున్నారు. వైద్యున్ని సంప్రదించి ట్రీట్ మెంట్ తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

రెప్పపాటు అంటే ఇదే :
కన్ను అదరడం అనేది ఎప్పుడినుంచో మూఢవిశ్వాసాలుగా శకునంగా భావిస్తున్నారు. కన్ను అదిరే స్థానం బట్టి ఒక్కో ఫలితం ఉంటుందని నమ్ముతారు. దీన్నే రెప్పపాటు కూడా అని కూడా పిలుస్తారు. ఒక్కో సంస్కృతిలో ఒక్కో విశ్వాసంగా చెప్పబడింది. రెప్పపాటుపై అనేక విశ్వాసాలు, నమ్మకాలు ముడిపడి ఉన్నాయి. మంచి లేదా చెడు రెండింటి కలయితతో ఈ రెప్పపాటును సూచిస్తుంది. భారత్, ఆఫ్రికా, హవాయి, చైనా వంటి దేశాల్లో రెప్పపాటు, కన్ను అదరడం వంటి వాటిని శకునాలుగా భావిస్తారు. పాటిస్తారు కూడా. అయితే ఆ దోషమనేది లింగం ఆధారంగా అటుఇటు మారుతుంది. కుడి కన్ను అదిరితే ఒకలా.. ఎడమ కన్ను అదిరితే మరొలా అని భావిస్తుంటారు. ఈ రెండింటిని అదిరే స్థానం బట్టి, సమయం ఆధారంగా ఫలితం ఉంటుందని భావిస్తున్నారు. చెడు ఫలితం కావొచ్చు.. మంచి ఫలితమై ఉండొచ్చు.

ఏయే సమయాల్లో ఏ ఫలితాలంటే? :
ఏయే సమయంలో కన్ను కొట్టుకుంటే అశుభం.. మంచి జరుగుతుందో కొన్ని సమయాలను కేటాయించారు. ఆయా సమయాల్లో మీ కన్ను అదిరినట్టయితే ఆ ఫలితం వస్తుందని నమ్ముతారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఎవరికైనా కుడికన్ను అదిరినట్టు అనిపిస్తే.. ఆ వ్యక్తికి ఏదో ఇన్విటేషన్ అందబోతుందని అర్థం చేసుకోవాలి. కానీ, సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య సమయంలో మీకు కన్ను అదిరితే ఆ వ్యక్తికి విపత్తు రాబోతుందని సంకేతంగా చెబుతారు.

డ్రాగన్ కంట్రీ చైనీస్ కల్చర్ లో కూడా కన్ను అదరడంపై అనేక నమ్మకాలు విశ్వాసాలు ఉన్నాయి. కళ్లు అదరడంపై చైనీయుల్లో వారికంటూ కొన్ని సొంత విశ్వాసాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఎడమ కన్ను అదిరితే అదృష్టంగా భావిస్తారు. అదే నిజమని వారు గట్టిగా నమ్ముతారు. ఒకవేళ కుడి కన్ను మాత్రమే కొట్టుకుంటే అది దురదృష్టంగా భావిస్తారు. అదే మహిళల్లో కుడి కన్ను అదిరినట్టు అనిపిస్తే అదృష్టమంటారు.

అదే ఎడమ కన్ను అదిరితే చెడు జరుగబోతుందని అర్థం చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో రెప్పపాటు వేయడం అనేది మరణాన్ని కూడా సూచించేదిగా చెబుతారు. కొన్ని రకాల సంస్కృతి, సంప్రదాయాల్లో కుడి కన్ను అదిరితే మాత్రం అది మరణానికి సంకేతంగా చెబుతారు. వారికి సమీప బంధువుల్లో ఎవరో ఒకరు మరణిస్తారని సంకేతంగా సూచించబడింది. కొన్ని చోట్ల కుడి కన్ను అదిరితే.. ఆ వ్యక్తిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారని, లేదంటే మంచి గుడ్ న్యూస్ వినబోతున్నారని నమ్ముతారు.

Read Also : Oral Diabetes : నోటిలో ఇలాంటి లక్షణాలు ఉంటే.. డయాబెటిస్ వచ్చినట్టేనా?

The post Eye Twitching Superstition : కన్ను అదురుతుందా? ఏమైనా కీడు జరుగుతుందా? appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
https://mearogyam.com/spiritual-news/eye-twitching-superstition-eye-twitching-reasons.html/feed 0