easy indian breakfast recipes for bachelors – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com MeArogyam Sun, 12 Dec 2021 18:48:32 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.3 https://mearogyam.com/wp-content/uploads/2021/11/cropped-mearogyam-favicon-1-32x32.png easy indian breakfast recipes for bachelors – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com 32 32 Instant Breakfast Recipes : 5 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్ ఫాస్ట్‌ల గురించి మీకు తెలుసా? https://mearogyam.com/kitchen-remedies/5-minute-breakfast-recipes-indian.html https://mearogyam.com/kitchen-remedies/5-minute-breakfast-recipes-indian.html#respond Wed, 06 Oct 2021 12:43:06 +0000 https://mearogyam.com/?p=949 Instant Breakfast Recipes : 5 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్ ఫాస్ట్‌ల గురించి మీకు తెలుసా?
MeArogyam Health News Telugu - MeArogyam.com

Instant Breakfast Recipes : ప్రస్తుతం అందరు దాదాపుగా ప్రతీ పనిని చాలా స్పీడ్‌గా చేసేయాలని అనుకోవడం మనం చూడొచ్చు. ఉరుకుల పరుగుల జీవనంలో వేగం అనేది చాలా ముఖ్యమైన అంశంగా మారిపోయింది. వేగంగా పనులు చేయగలిగితేనే కాంపిటీటివ్ వరల్డ్‌లో మనగలుగుతామన్నది వారి అభిప్రాయం. కానీ, పోటీ ప్రపంచంలో పడి ఆరోగ్యాన్ని మరిచిపోవడం ప్రమాదకరం. ఇలా ప్రతీ పని స్పీడ్‌గా చేసేస్తుంటే రోగాలు కూడా స్పీడ్‌గా వచ్చి ఇబ్బందులు తెచ్చిపెడుతాయి. ఈ నేపథ్యంలో ప్రతీ పనిని బ్యాలెన్స్ […]

The post Instant Breakfast Recipes : 5 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్ ఫాస్ట్‌ల గురించి మీకు తెలుసా? appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
Instant Breakfast Recipes : 5 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్ ఫాస్ట్‌ల గురించి మీకు తెలుసా?
MeArogyam Health News Telugu - MeArogyam.com

Instant Breakfast Recipes : ప్రస్తుతం అందరు దాదాపుగా ప్రతీ పనిని చాలా స్పీడ్‌గా చేసేయాలని అనుకోవడం మనం చూడొచ్చు. ఉరుకుల పరుగుల జీవనంలో వేగం అనేది చాలా ముఖ్యమైన అంశంగా మారిపోయింది. వేగంగా పనులు చేయగలిగితేనే కాంపిటీటివ్ వరల్డ్‌లో మనగలుగుతామన్నది వారి అభిప్రాయం. కానీ, పోటీ ప్రపంచంలో పడి ఆరోగ్యాన్ని మరిచిపోవడం ప్రమాదకరం. ఇలా ప్రతీ పని స్పీడ్‌గా చేసేస్తుంటే రోగాలు కూడా స్పీడ్‌గా వచ్చి ఇబ్బందులు తెచ్చిపెడుతాయి.

ఈ నేపథ్యంలో ప్రతీ పనిని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ముఖ్యం.. ఈ సంగతులు పక్కనబెడితే.. ప్రజెంట్ ఫుడ్ ఐటమ్స్ తీసుకునే విధానంలో ఒకప్పటితో పోల్చితే చాలా మార్పులొచ్చాయి. మార్నింగ్ టైంలో టిఫిన్ చేయాల్సిందేనని పట్టుబట్టేవారిని మనం బోలెడు మందిని చూడొచ్చు. అయితే, టిఫిన్ ప్రిపరేషన్‌కు కొంచెం టైం పడుతుంది.
Instant Breakfast Recipes

Instant Breakfast Recipes: గృహిణులు ఇందుకోసం ముందు రోజు నుంచి ప్రిపేరేషన్స్ చేస్తుంటారు. కాగా, అతి తక్కువ సమయంలోనే టిఫిన్స్ చేయగలిగితే అది వారికి, తినేవారికి చాలా బాగుంటుంది. ఈ నేపథ్యంలోనే కేవలం ఐదు నిమిషాల్లో రెడీ అయ్యే టిఫిన్ మాదిరిగా బ్రేక్ ఫాస్ట్‌ల గురించి తెలుసుకుందాం.

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరి :
మార్నింగ్ టైమ్స్‌లో ఉద్యోగానికి వెళ్లే సమయంలో బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం ఒక్కోసారి చాలా మంది ఉద్యోగులు మరిచిపోతుంటారు. దానికి ప్రధాన కారణం సమయాభావంతో పాటు బ్రేక్ ఫాస్ట్ (Instant breakfast recipes )తయారయ్యేందుకు పట్టే సమయం. పొద్దున్నే ఆఫీసుకు వెళ్లాలనుకున్నపుడు అంత తొందరగా ఇంట్లో బ్రేక్ పాస్ట్ ఒక్కో సారి రెడీ కాకపోవచ్చు. దాంతో వారు ఏం తినకుండానే ఉద్యోగానికి వెళ్లిపోతుంటారు. కాగా గృహిణులు ఎంత శ్రమ చేకూర్చినప్పటికీ బ్రేక్ ఫాస్ట్ తయారీకి కనీసంగా గంట లేదా అరగంట లేదా అంతకు మించిన సమయం పడుతుంది.

ఈ నేపథ్యంలో వారు ఈ బ్రేక్ ఫాస్ట్‌లను గురించి తెలుసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీటిని కేవలం ఐదే నిమిషాల్లో తయారు చేసి మీరు హ్యాపీగా తినేయొచ్చు. వేరుశనగ పప్పు లేదా నల్లశనగలు కొన్ని ప్రాంతాల్లో వీటిని బుడ్డ శనగలు అంటారు. వీటిని మీకు కావాల్సినంత మేర పాత్రలో వేసి ఒక ఐదు నిమిషాలపాటు ఉడకబెట్టాలి. అవి ఉడికే సమయంలో టమాటా, ఉల్లిగడ్డ, కొత్తమీర సన్నగా తరిగి తగినంత ఉప్పు శనిగలు ఉడికిన తర్వాత అందులో వేయాలి వీటికి తోడుగు ఫ్రెష్ మిరియాల పొడి కూడా అందులోనే వేయాలి.

అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్ రెడీ :
అలా వాటిని కనీసంగా ఐదు నిమిషాలు ఉడికిస్తే చాలు మీరు తినేందుకుగాను అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్ రెడీ అయిపోతుంది. అది ఒక సలాడ్ లాగా అనిపిస్తుంది. అత్యంత సులువుగా ఈ బ్రేక్ ఫాస్ట్‌ను మీరు రెడీ చేసుకోవచ్చు. ఇన్‌గ్రేడియంట్స్ అన్ని ఉన్నా లేక ఏదైనా మిస్ అయిన ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఎంచక్కా హ్యాపీగా ఫైవ్ మినట్స్‌లోనే బ్రేక్ ఫాస్ట్ రెడీ చేసుకుని మీరు ఆరగించేయొచ్చు. మరో బ్రేక్ ఫాస్ట్ విషయానికొస్తే.. ఇది కూడా ఐదే నిమిషాల్లో అతి సులువుగా రెడీ చేసుకోవచ్చు.

ఇందుకుగాను మీరు గోధుమ బ్రెడ్ ప్యాకెట్స్ తెచ్చుకోవాలి. గోధుమ బ్రెడ్ తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.. ఒక్కో బ్రెడ్ పీసును పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఎగ్‌ను ఆమ్లెట్ చేసుకున్న మాదరిగా వేడి పెనం మీద గుడ్డు కొట్టి అందులో ఉప్పు, మిరియాలపొడి తగినంత వేసి వేడిచేయాలి. అది రెండు వైపులా మంచిగా కాలిన తర్వాత దానిని బ్రెడ్ ముక్కలపై పెట్టుకుని, ఉల్లిగడ్డలు, టమాటా ముక్కలు పెట్టుకుని తినేయొచ్చు. ఇదంతా చేయడానికి ఐదే నిమిషాలు పడుతుంది. మీ టైం కూడా చాలా సేవ్ అవుతుంది.

Instant Breakfast Recipes
Instant Breakfast Recipes

ఐదు నిమిషాల్లోపే బ్రేక్ ఫాస్ట్ రెడీ :
ఇకపోతే ఇదే కాకుండా మరో బ్రేక్ ఫాస్ట్ కూడా మీరు సులువుగానే రెడీ చేసుకోవచ్చు. ఇది చేసుకోవడాకి అయితే మీకు ఐదు నిమిషాల కంటే కూడా ఇంకా తక్కువ సమయమే పట్టొచ్చు. ఒక పాత్రలో చిక్కటి పెరుగును ఉంచాలి. అందులో వేరుశనగలను పొట్టు తీసి వేయాలి. అలా వేసిన తర్వాత సరిపోయేంత ఉప్పు వేసి, అరటి పండు సన్నగా తరిమి అందులో వేయాలి. అంతే మీ బ్రేక్ ఫాస్ట్ రెడీ అయిపోతుంది. అలా వేసుకుని తింటే చాలా బాగుంటుంది.

మీకు ఒకవేళ స్వీట్ అంటే చాలా ఇష్టం ఉన్నట్లయితే బెల్లం కాని చక్కర కాని అందులో వేసుకుని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇకపోతే బ్రేక్ ఫాస్ట్ అంటే కేవలం వేడి చేయబడిన ఆహార పదార్థాలే అనుకుంటే మీరు పొరపడినట్లే.. తాజా కూరగాయలు, ఫ్రూట్స్‌తో కాంబినేషన్‌లో చేయబడిన రెసిపీలు కూడా బ్రేక్ ఫాస్ట్ కిందకు వస్తాయి. వాటిని అతి తక్కువ సమయంలోనే రెడీ చేసుకోవచ్చు.

Instant Breakfast Recipes
Instant Breakfast Recipes

బ్రేక్ ఫాస్ట్ ఐటంగా కీరదోస :
కాకపోతే డైజేషన్‌కు బాగా సహకరించే కీర దోసకాయను బ్రేక్ ఫాస్ట్ ఐటంగా తినేయొచ్చు. ఇందుకుగాను మీరు కీర దోసకాయ పొట్టును తీసేసి దానిపైన కొంచెం ఉప్పు, మిరియాల పొడి వేయాలి. ఆ తర్వాత సన్నగా తరిమి అందులో కొంచెం వెల్లుల్లి కూడా వేసి పక్కన పెట్టి ఉంచాలి. అలా ఉంచిన ఐదు నిమిషాల హ్యాపీగా మీరు ఈ బ్రేక్ ఫాస్ట్ ఐటంను తినేయొచ్చు. అతి తక్కువ సమయంలోనే అనగా ఐదు నిమిషాల్లోనే రెడీ అయ్యే బ్రేక్ ఫాస్ట్‌లను తీసుకుంటే మీ టైమ్ సేవ్ అవడంతో పాటు హెల్త్‌కు మంచి ప్రయోజనాలు ఉంటాయి.

The post Instant Breakfast Recipes : 5 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్ ఫాస్ట్‌ల గురించి మీకు తెలుసా? appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
https://mearogyam.com/kitchen-remedies/5-minute-breakfast-recipes-indian.html/feed 0