Barleria Prionitis Benefits – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com MeArogyam Wed, 17 Nov 2021 12:25:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.3 https://mearogyam.com/wp-content/uploads/2021/11/cropped-mearogyam-favicon-1-32x32.png Barleria Prionitis Benefits – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com 32 32 Vajradanti Plant Benefits : వజ్రదంతిలో అద్భుత ఔషధాలు.. పంటిడాక్టర్‌తో పనిలేదిక.. దంత సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికినట్టే..! https://mearogyam.com/ayurvedic-tips/vajradanti-plant-health-benefits-for-dental-problems.html https://mearogyam.com/ayurvedic-tips/vajradanti-plant-health-benefits-for-dental-problems.html#respond Tue, 19 Oct 2021 18:41:25 +0000 https://mearogyam.com/?p=1165 Vajradanti Plant Benefits : వజ్రదంతిలో అద్భుత ఔషధాలు.. పంటిడాక్టర్‌తో పనిలేదిక.. దంత సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికినట్టే..!
MeArogyam Health News Telugu - MeArogyam.com

vajradanti plant health benefits : నగరాల్లో నివాసముండే జనాల చెట్లు, పూలమొక్కలకు దూరంగా జీవనం సాగిస్తుంటారు. అదే పల్లెటూర్లో ఉండే ప్రజలు నిత్యం పూలు, పండ్ల మొక్కలు, ప్రకృతిలో మమేకం అవుతుంటారు. ఆరోగ్యం పరంగా చూసుకుంటే నగరాల్లో జీవించే వారికంటే పల్లెల్లో జీవించే వారే ఆరోగ్యంగా ఉంటారు. అయితే, పల్లెల్లో నివసించే జనాల ఇంటి చుట్టూ చాలా పూలమొక్కలు ఉంటుంటాయి. అందులో కొన్ని ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వాటి గురించి ఆ ఇంట్లోని వారికి […]

The post Vajradanti Plant Benefits : వజ్రదంతిలో అద్భుత ఔషధాలు.. పంటిడాక్టర్‌తో పనిలేదిక.. దంత సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికినట్టే..! appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
Vajradanti Plant Benefits : వజ్రదంతిలో అద్భుత ఔషధాలు.. పంటిడాక్టర్‌తో పనిలేదిక.. దంత సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికినట్టే..!
MeArogyam Health News Telugu - MeArogyam.com

vajradanti plant health benefits : నగరాల్లో నివాసముండే జనాల చెట్లు, పూలమొక్కలకు దూరంగా జీవనం సాగిస్తుంటారు. అదే పల్లెటూర్లో ఉండే ప్రజలు నిత్యం పూలు, పండ్ల మొక్కలు, ప్రకృతిలో మమేకం అవుతుంటారు. ఆరోగ్యం పరంగా చూసుకుంటే నగరాల్లో జీవించే వారికంటే పల్లెల్లో జీవించే వారే ఆరోగ్యంగా ఉంటారు. అయితే, పల్లెల్లో నివసించే జనాల ఇంటి చుట్టూ చాలా పూలమొక్కలు ఉంటుంటాయి.

అందులో కొన్ని ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వాటి గురించి ఆ ఇంట్లోని వారికి కూడా తెలియకపోవచ్చు. కొందరి ఇళ్లలో డిసెంబర్ పూల మొక్కలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. చలికాలం అనగా డిసెంబర్ నెలలో ఈ చెట్లకు ఎక్కువగా పూలు పూస్తుంటాయి. అందుకే దీనిని డిసెంబర్ పూల చెట్టు (December Flower Plant) లేదా ముళ్ల గోరింట అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం (barleria prionitis). అయితే, ఈ చెట్టులోని ఔషధ గుణాలు.. దీని వలన కలిగే ఉపయోగాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

దంతాలకు వజ్ర కవచం..
ముళ్ళ గోరింట చెట్టు వేర్లను ఎండబెట్టి పొడిలాగా చేసుకుని పళ్లు తోమితే తెల్లగా మిలమిల మెరిసిపోతాయి. అందుకే దీనిని సంస్కృతంలో వజ్రదంతి (Vajradanti Plant) అని కూడా పిలుస్తుంటారు. దంతాలను వజ్రాల వలే గట్టిగా, మెరిసిపోయేలా చేస్తుందని దానికి ఆ పేరు వచ్చింది. ఇది దంత సమస్యలను సైతం దూరం చేస్తుంది. డిసెంబర్ పూల చెట్టు ఆకులకు మెత్తగా చేసి ఉప్పు కలిపి నూరుకోవాలి. దీనితో పళ్ళు తోముకుంటే దంతాలపై ఉన్న క్రిములు, పాచి, పిప్పళ్లు, చిగుళ్ల వాపు, రక్తం కారడం వంటి సమస్యలు దూరమవుతాయి. అదేవిధంగా దంతాలు తెల్లగా మెరవడం మాత్రమే కాకుండా ధృడంగా తయారవుతాయి.

ఈ చెట్టు ఆకులు, బెరడును ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించుకోవాలి.ఆ తర్వాత నీటిని వడగట్టి నోట్లో పోసుకుని పుక్కిలించి ఉంచినట్లయితే నోటి దుర్వాసన పోతుంది. నోటి అల్సర్ తగ్గడమే కాకుండా, మౌత్ ఫ్రెషనర్‌గా కూడా పనిచేస్తుంది. ఈ చెట్టు బెరడును సేకరించి మెత్తగా దంచి పొడి రూపంలో చేసుకోవాలి.

రోజూ ఓ చెంచా పొడిని నీటిలో కలిపి తీసుకోవడం వలన కీళ్ల నొప్పులు, ఒళ్ళు నొప్పులు తగ్గుముఖం పడుతాయి. అంతేకాకుండా శరీరంలో నిల్వ ఉన్న చెడు కొవ్వును కరిగిస్తుంది. అధిక బరువు తగ్గాలనుకునేవారికి ఈ పొడి చాలా బాగా పనిచేస్తుంది. గుండె సంబంధిత సమస్యలను సైతం దూరం చేస్తుంది.

దంత సమస్యలతో (Teeth Problems) బాధపడేవారు ఈ వజ్రదంతిని వాడటం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. దంతాలను ఆరోగ్యంగా ఉంచడంలో వజ్రదంతి అద్భుతంగా పనిచేస్తుంది. వజ్రదంతి ద్వారా సేకరించిన ఆకులను బాగా ఎండబెట్టాలి. ఆ తర్వాత ఎండిన ఆకులను పొడిగా చేయాలి. ఆ తర్వాాత దాన్ని ఫిల్టర్ చేయాలి.

చూర్ణంగా తయారైన ఈ పొడిన ప్రతిరోజూ ఒక గ్లాసు నీటిలో కలిపి తీసుకోవడం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుండాలి. త్వరలోనే మీ నోటి అనారోగ్య సమస్యలు తొలిగిపోతాయి. చిగుళ్ల సమస్యలు, పళ్లు ఊడిపోవడం వంటి సమస్యలకు చెక్ పెట్టేస్తుంది. ఒక్క దంత సమస్యలను మాత్రమే కాదు.. ఇతర అనారోగ్య సమస్యలను కూడా దూరం చేయగల గుణాలు ఉన్నాయి.

The post Vajradanti Plant Benefits : వజ్రదంతిలో అద్భుత ఔషధాలు.. పంటిడాక్టర్‌తో పనిలేదిక.. దంత సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికినట్టే..! appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
https://mearogyam.com/ayurvedic-tips/vajradanti-plant-health-benefits-for-dental-problems.html/feed 0