సామాజిక ఒత్తిడి – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com MeArogyam Wed, 17 Nov 2021 12:19:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.3 https://mearogyam.com/wp-content/uploads/2021/11/cropped-mearogyam-favicon-1-32x32.png సామాజిక ఒత్తిడి – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com 32 32 Obesity with Mental Stress : మానసిక ఒత్తిడితో ఊబకాయం.. ఎలా తగ్గించుకోవచ్చు? నిపుణులు ఏమంటున్నారు? https://mearogyam.com/fitness/obesity-with-mental-stress-how-can-obesity-be-reduced.html https://mearogyam.com/fitness/obesity-with-mental-stress-how-can-obesity-be-reduced.html#respond Sun, 03 Oct 2021 09:51:54 +0000 https://mearogyam.com/?p=911 Obesity with Mental Stress : మానసిక ఒత్తిడితో ఊబకాయం.. ఎలా తగ్గించుకోవచ్చు? నిపుణులు ఏమంటున్నారు?
MeArogyam Health News Telugu - MeArogyam.com

obesity with mental stress : ఒకప్పటితో మనుషులు జీవనశైలి ప్రస్తుతం చాలా మారింది. తినే తిండి నుంచి చేసే పని వరకు అన్ని మారిపోయాయి. దాంతో జనం ప్రతీ పని స్పీడ్‌గా చేసేస్తున్నారు. ఉరుకుల పరుగుల జీవనంలో భాగమై అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అయితే, ఇలా పనిలో పడిపోయి, ఒత్తిడి బాగా పెరిగిపోవడం వల్ల చాలా మంది ఊబకాయులు అవుతున్నారు. అయితే, ఊబకాయం మానసిక ఒత్తిడి వల్ల కలుగుతుందా? నిపుణులు ఏమంటున్నారు? అనే విషయాలు […]

The post Obesity with Mental Stress : మానసిక ఒత్తిడితో ఊబకాయం.. ఎలా తగ్గించుకోవచ్చు? నిపుణులు ఏమంటున్నారు? appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
Obesity with Mental Stress : మానసిక ఒత్తిడితో ఊబకాయం.. ఎలా తగ్గించుకోవచ్చు? నిపుణులు ఏమంటున్నారు?
MeArogyam Health News Telugu - MeArogyam.com

obesity with mental stress : ఒకప్పటితో మనుషులు జీవనశైలి ప్రస్తుతం చాలా మారింది. తినే తిండి నుంచి చేసే పని వరకు అన్ని మారిపోయాయి. దాంతో జనం ప్రతీ పని స్పీడ్‌గా చేసేస్తున్నారు. ఉరుకుల పరుగుల జీవనంలో భాగమై అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అయితే, ఇలా పనిలో పడిపోయి, ఒత్తిడి బాగా పెరిగిపోవడం వల్ల చాలా మంది ఊబకాయులు అవుతున్నారు. అయితే, ఊబకాయం మానసిక ఒత్తిడి వల్ల కలుగుతుందా? నిపుణులు ఏమంటున్నారు? అనే విషయాలు తెలుసుకుందాం.

అధిక బరువుకు కారణం ఇదే :
మనుషులు ఊబకాయులు కావడానికి రకరకాల కారణాలు ఉన్నాయని పరిశోధకులు తేల్చారు. వారు శాస్త్రీయంగా అధ్యయనం చేసి మరి పలు విషయాలను నిర్ధారించారు. శారీరక, మానసిక అంశాల సమ్మేళనంతో వెయిట్ బాగా పెరిగిపోతారని పేర్కొన్నారు. అయితే, అందరికీ ఇటువంటి సిచ్యువేషన్స్ ఉండకపోవచ్చని, బాడీ టు బాడీ చేంజ్ అయే చాన్సెస్ ఉంటాయని తెలిపారు.

ఇకపోతే సంకల్ప బలం లోపించడం వల్లే ఊబకాయం ఏర్పడుతుందని స్పష్టం చేశారు పరిశోధకులు. ఈ క్రమంలోనే ఊబకాయానికి ప్రత్యేకంగా కారణాలంటు ఏమి ఉండబోవు. ప్రస్తుతం జీవన విధానంలో పనిఒత్తిడి కూడా ముఖ్య కారణంగా ఉంటుందని చెప్పారు.

ఊబకాయానికి చెక్ పెట్టండిలా :
మారుతున్న ఆహారపు అలవాట్లు అనగా మన సంస్కృతి పూర్తిగా మారిపోతున్నది. ఒకప్పటిలాగా తాజా కూరగాయలు, ఆహార పదార్థాలు ఇప్పుడు ఉండటం లేదు. రసాయనిక పదార్థాలుగా ఆహార పదార్థాలు మారిపోతున్నాయి. ఇకపోతే ఉద్యోగాల్లో ఉండే చాలా మంది ఒకేచోట చాలా సేపు కూర్చొని ఉండటం, ఫలితంగా బద్దకం ఏర్పడుతుంటుంది.

వారు అలా లేవకుండా కూర్చొని తింటుండటం వల్ల కూడా ఊబకాయం ఏర్పడుతుంది. మానసిక సమస్యలను జయించడం ద్వారా ఊబకాయానికి చెక్ పెట్టొచ్చని నిపుణులు చెప్తున్నారు. మానసిక ఇబ్బందుల వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతున్నట్లు స్టడీలో తేలిందని పేర్కొన్నారు. ఇకపోతే ఊబకాయం జన్యు సంబంధితమైనదిగాను కన్ఫర్మ్ చేసేశారు. వారి వంశీకుల నుంచి ఊబకాయం రావొచ్చు.

ఇకపోతే ఒకప్పటిలాగా ఇప్పుడు పాఠశాలల్లో ఆటలకు అంత ప్రయారిటీ ఇవ్వమనం చూడొచ్చు. కేవలం కెరీర్ ఓరియంటెడ్ కోర్సెస్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పిల్లల్లో శారీరక, మానసిక ఉల్లాసం కలగడం లేదు. దాంతో పిల్లలకు అసలు గెలుపు, ఓటములు తెలియడం లేదు. ఫలితంగా రేపు భవిష్యత్తులో వారు ఉద్యోగులుగా మారిన క్రమంలో ఒత్తిడిని తట్టుకోలేకపోయి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతీ ఒక్కరు పిల్లల నుంచి మొదలుకుని వృద్ధుల వరకు అందరూ ఎక్సర్‌సైజెస్ చేయడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.

హార్ట్ ఎటాక్ ముప్పు ఎక్కువ :
సిటీల్లోనే కాదు పల్లెటూర్లలోనూ ఒకప్పటి మాదిరిగా ఆటలు ఆడే పరిస్థితులు తగ్గిపోతున్నాయి. ఈ క్రమంలో పాఠశాల ఉపాధ్యాయులతో పాటు పిల్లల తల్లిదండ్రులు సైతం ఆటలు ఆడేందుకు పిల్లలను పంపించాలి. వారిని ఆటల వైపునకు కూడా మళ్లించాలి. ఆటలు అంటే కేవలం స్మార్ట్ ఫోన్స్‌లో ఉండేవి మాత్రమే కావని, శారీరకంగా శ్రమ చేకూర్చి ఆడాల్సిన ఆటలుంటాయని తెలియజేయాలి. చాలా మంది పిల్లలు చిన్న వయసులోనే ఊబకాయులు కావడానికి కారణం వారు అసలు శారీరక శ్రమ చేకూర్చే ఆటల వైపుగా మొగ్గు చూపకపోవడమేనని తెలుస్తోంది.

ఇకపోతే ఊబకాయం కంట్రోల్ చేసుకోవడం కోసం అనగా వెయిట్ లాస్ కావడం కోసం శ్రమ చేయాలంటే చాలా మంది టైం లేదని చెప్తుండటం మనం చూడొచ్చు. టైం లేదు అని చెప్తే కుదరదు. అలా చెప్పడం వల్ల మీకే నష్టం కలుగుతుంది. ఊబకాయం ఆటోమేటిక్‌గా మీ హెల్త్‌ను చాలా డిసాప్పాయింట్ చేయడంతో పాటు మీ హార్ట్‌పైన ఇంపాక్ట్ చూపుతుంది. హార్ట్ అటాక్ వచ్చే చాన్సెస్ కూడా బాగా పెరుగుతాయి.

శారీరక శ్రమతో అధిక బరువు కంట్రోల్ :
ఈ నేపథ్యంలో మీరు ఎలాగైతే స్మార్ట్ ఫోన్‌లో సినిమాలు లేదా ఇతర పనుల కోసం టైం కేటాయిస్తారో అదే మాదిరిగా యోగా లేదా వాకింగ్ లేదా ఇతర ఎక్సర్ సైజెస్ చేయడం కోసం టైమ్ కేటాయించుకోవాలి. తద్వారా మీ హెల్త్‌కు మంచి జరగడంతో పాటు వెయిట్ లాస్ అవుతారు. ఊబకాయ వ్యాధి నుంచి బయటపడతారు. ఊబకాయం అనేది సాధారణంగా అధిక వెయిట్ వల్ల కలుగుతుంది.

psychological stress and obesity
psychological stress and obesity

వెయిట్ పెరుగుతున్నామన్న సంగతిని కొంత మంది మరిచిపోతుంటారు. పనిలో పడి, ఒత్తిడిని భరిస్తూ ఫుడ్ తింటూ అదే పనిగా పనులు చేస్తూ ఉండిపోతుంటారు. అలా చేయడం చాలా ప్రమాదకరం. ఒత్తిడి ఎప్పుడైనా మానవుడిని ఇంకా ఇబ్బందుల పాలు చేస్తుంది. ఒత్తిడిని డీల్ చేసే విధానం తెలుసుకోవాలి. అలాగే హెవీ వెయిట్ లాస్ కావడం కోసం మీరు తినే ఆహార పదార్థాలపైన శ్రద్ధ వహించాలి. ఫుడ్ డైట్ పాటించాలి.

ఏవి పడితే అవి తినొద్దు :
ఫుడ్ ఐటమ్స్ ఏవి పడితే అవి తినకుండా మీకు పడేటివి మాత్రమే తీసుకోవాలి. ఈ క్రమంలోనే అధిక బరువు వల్ల మీకు చాలా ఇబ్బందులు ఉంటాయన్న సంగతి గుర్తించి ప్రతీ రోజు అధిక బరువు తగ్గించుకునేందుకు‌గాను కసరత్తులు చేస్తుండాలి. శారీరక శ్రమ తప్పకుండా చేయాలి. అలా చేస్తేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఊబకాయం ఫస్ట్ స్టేజీ దాటిపోతే కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంటుదని నిపుణులు హెచ్చరిస్తున్నారు కూడా.

ఈ క్రమంలో వెయిట్ లాస్ అయ్యేందుకుగాను సహజ సిద్ధమైన పద్ధతులు శారీరక శ్రమ చేయడం, వ్యాయామాలు చేయడం, ఫుడ్ ఐటమ్స్ పట్ల జాగ్రత్త వహించడం మస్ట్ అన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఊబకాయం కంట్రోల్ చేసుకోకపోతే అది ఇంకా ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీసి మిమ్మల్ని ఇంకా ఇబ్బందులు పాలు చేస్తుంది.

The post Obesity with Mental Stress : మానసిక ఒత్తిడితో ఊబకాయం.. ఎలా తగ్గించుకోవచ్చు? నిపుణులు ఏమంటున్నారు? appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
https://mearogyam.com/fitness/obesity-with-mental-stress-how-can-obesity-be-reduced.html/feed 0