వారాహి దేవి 12 నామాలు – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com MeArogyam Thu, 15 Jun 2023 19:43:04 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.3 https://mearogyam.com/wp-content/uploads/2021/11/cropped-mearogyam-favicon-1-32x32.png వారాహి దేవి 12 నామాలు – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com 32 32 Varahi Devi Navaratri Pooja : వారాహి నవరాత్రుల పూజ విధానం.. ఆషాడ మాసంలో వారాహి అమ్మవారిని ఎలా పూజించాలి? ఏ రోజు పూజా విధానం ఎలా? https://mearogyam.com/spiritual-news/varahi-devi-navaratri-pooja-ashada-varahi-devi-navaratri-9-days-puja-vidhanam-in-telugu.html https://mearogyam.com/spiritual-news/varahi-devi-navaratri-pooja-ashada-varahi-devi-navaratri-9-days-puja-vidhanam-in-telugu.html#respond Thu, 15 Jun 2023 19:39:27 +0000 https://mearogyam.com/?p=5850 Varahi Devi Navaratri Pooja : వారాహి నవరాత్రుల పూజ విధానం.. ఆషాడ మాసంలో వారాహి అమ్మవారిని ఎలా పూజించాలి? ఏ రోజు పూజా విధానం ఎలా?
MeArogyam Health News Telugu - MeArogyam.com

Varahi Devi Navaratri Pooja : వారాహి నవరాత్రులు ఎప్పటినుంచి ఎప్పటి వరకు ఏ రూపాలలో వారాహి అమ్మవారిని పూజించాలి. దీపం ఎలా పెట్టాలి?  అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలి? ఇంకా వారాహి అమ్మవారి ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వీటిఅన్నింటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. వారాహి అమ్మ వారి పూజా పద్ధతులు అందరూ తప్పక తెలుసుకోవాలి. ఈ సంవత్సరం 2023 వారాహి నవరాత్రులు ఆషాడమాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు నవరాత్రులు జరుపుకుంటారు. సాధారణంగా ఆషాడమాసంలో వచ్చే […]

The post Varahi Devi Navaratri Pooja : వారాహి నవరాత్రుల పూజ విధానం.. ఆషాడ మాసంలో వారాహి అమ్మవారిని ఎలా పూజించాలి? ఏ రోజు పూజా విధానం ఎలా? appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
Varahi Devi Navaratri Pooja : వారాహి నవరాత్రుల పూజ విధానం.. ఆషాడ మాసంలో వారాహి అమ్మవారిని ఎలా పూజించాలి? ఏ రోజు పూజా విధానం ఎలా?
MeArogyam Health News Telugu - MeArogyam.com

Varahi Devi Navaratri Pooja : వారాహి నవరాత్రులు ఎప్పటినుంచి ఎప్పటి వరకు ఏ రూపాలలో వారాహి అమ్మవారిని పూజించాలి. దీపం ఎలా పెట్టాలి?  అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలి? ఇంకా వారాహి అమ్మవారి ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వీటిఅన్నింటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. వారాహి అమ్మ వారి పూజా పద్ధతులు అందరూ తప్పక తెలుసుకోవాలి. ఈ సంవత్సరం 2023 వారాహి నవరాత్రులు ఆషాడమాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు నవరాత్రులు జరుపుకుంటారు. సాధారణంగా ఆషాడమాసంలో వచ్చే నవరాత్రులను గుప్త నవరాత్రులుగా జరుపుకుంటారు. అదే, నార్త్ ఇండియాలో నవదుర్గలుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మ వారిని కొలుస్తారు.

ఈ నవరాత్రులనే కొన్ని ప్రాంతాలలో భద్రకాళి నవరాత్రులుగాను ఇంకొన్ని ప్రాంతాలలో శాకంబరి నవరాత్రులుగా జరుపుకుంటారు. మన దక్షిణ భారతదేశంలో అయితే, ఈ నవరాత్రులను వారాహి నవరాత్రులుగా జరుపుకుంటారు. వారాహి నవరాత్రులను ఎవరైనా జరుపుకోవచ్చు. ఆలయాల్లో కూడా విశేష పూజలు, సామూహిక హోమాలు, అభిషేకాలు జరుగుతాయి. అయితే, కొన్ని ప్రాంతాలలో ఈ నవరాత్రులు వారాహి అమ్మవారితో పాటు మిగతా సప్తమాతృకంలో కూడా కొలుస్తారు.

వారాహి దేవి 12 నామాలు.. అత్యంత శక్తివంతమైనవి : 
ఎందుకంటే.. వారాహి అమ్మవారు కూడా సప్తమాతృకంలో ఒకరు కొన్ని ప్రాంతాల్లో జరిగే పద్ధతి. ఈ పద్ధతిని కొన్ని పుస్తకాల్లో రాయడం జరిగింది. ఎక్కువ మంది పాటించే పద్ధతి ఇప్పుడు తెలుసుకుందాం. వారాహి 12 నామాలు అత్యంత శక్తివంతమైనవిగా చెబుతారు. పంచమి, సమయ సంకేత, దండనాథా, వారాహీ, సంకేతా, పోత్రిణి, శివా, మహాసేన, వార్తాళి, అరిఘ్ని ఆజ్ఞా చక్రేశ్వరి అనే 12 నామాలుగా పిలుస్తారు. ఈ 12 నామాలను ప్రతిరోజూ 11 సార్లు పఠిస్తే.. ఆషాడ మాసం పాడ్యమి రోజు ఉన్నత వారాహిగా కొలుస్తారు. ఎందుకంటే.. వారాహి క్షేత్రపాలకుడు ఉన్నత భైరవుడు వారాహి కుబేర ఉపాసకులు ముందుగా ఉన్నత భైరవ ఉపాసన చేయాలి. ఈయన అనుగ్రహంతోనే వారాహి పూజలు ఫలిస్తాయి.

అందుకే, మొదటి రోజు ఉన్నత వారహిగా పూజిస్తారు. రెండవ రోజు అనగా విదేయ రోజు బృహ ద్వారా కొలుస్తారు. మూడవరోజు స్వప్న వారాహిక కొలుస్తారు. నాలుగవ రోజు కిరాతవారాహిగా కొలుస్తారు. ఐదవరోజు అంటే.. పంచమి రోజు శ్వేత వారాహిగా కొలుస్తారు. ఈ ఐదవ రోజు పూజ చాలా విశేషమైనది. ఎందుకంటే కొన్ని పురాణాల ప్రకారం.. ప్రస్తుతం ఉన్న కల్పం స్వేత వరాహ కల్పము.. కల్పము అంటే.. ఆరు మనవంతరాలు ఒక మన్మంతరం అంటే.. 30 కోట్ల 67 లక్షల 20 వేల సంవత్సరాలు. శ్వేత వరాహ స్వామి మూలమే శ్వేత వారాహి దేవి. ఆ స్వేద వరాహ స్వామి మన భూమిని రక్షించాడు. అందుకే, పంచమి రోజు శ్వేత వారాహిగా పూజిస్తారు.

Varahi Devi Navaratri Pooja : వారాహి నవరాత్రులు 2023 పూజ విధానం ఎలా..?

ఇక 6వ రోజు అంటే.. షష్టి రోజు ధూమ్ర వారాహిగా పూజిస్తారు ఏడవ రోజు అంటే.. సప్తమి రోజు మహా వారాహిగా పూజిస్తారు. 8వ రోజు అంటే అష్టమి రోజు వార్తాలి వారాహిగా పూజిస్తారు. తొమ్మిదవ రోజు అంటే.. నవమి రోజు దండిని వారాహిగా పూజిస్తారు. పదవరోజు మహా వారహిగా మహా పూజ చేసి నవరాత్రులను ముగిస్తారు. ఈమెని ఆదివారాహిగా పిలుస్తారు. ఈ తొమ్మిది రూపాయలతో ధ్యాన శ్లోకాలను ఏ రోజు రూపం అయితే.. ఆ అమ్మవారి ధ్యాన శ్లోకాలు చదుకోవచ్చు. ప్రత్యేకంగా అన్ని రూపాలకు అష్టోత్తరాలు స్తోత్రాలు లేవు. కాబట్టి ప్రతిరోజు ధ్యాన శ్లోకం చదువుకొని వారాహి అమ్మవారి అష్టోత్తరాలు స్తోత్రాలు సహస్రనామాలతో మీ శక్తిని బట్టి పూజ చేసుకోవచ్చు. ఈ నవరాత్రులను రాత్రి 7 గంటల తర్వాత చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఈ అమ్మవారు రాత్రి దేవత కాబట్టి.. మీ ఓపికను బట్టి వేకువ జామున 4 గంటల వరకు కూడా పూజ చేసుకోవచ్చు. ఈ నవరాత్రుల్లో మీకేమైనా ఆటంకాలు వచ్చి పూజ చేయలేకపోతే.. అష్టమి పంచమి తిధుల్లోనూ మంగళ, శుక్రవారంలోనూ పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే.. ఈ రోజులు అమ్మవారికి ఇష్టమైన రోజులు. ఇప్పుడు మనం పూజా విధానం గురించి తెలుసుకుందాం.

వారాహి అమ్మవారి ఫొటో పెట్టొచ్చా?  ఫొటో లేకుండా పూజ చేయకూడదా? :
ముందుగా అమ్మవారి ఫొటోని సిద్ధం చేసుకోవాలి. చాలామంది అమ్మవారి ఫొటో పెట్టుకోవచ్చా లేదా? అని సందేహం రావొచ్చు. చాలామంది ఫొటో పెట్టుకోవచ్చు అని మహా పండితులు చెబుతున్నారు. ఇంతకీ దీపం ఎలా పెట్టాలి. అంటే.. పంచముఖ దీపం పెట్టాలి. పంచముఖ దీపం ఒక పెద్ద ఒత్తి తీసుకుని దానితోనే 5 దీపాలు చేయాలి. ఇంకొక పద్ధతి కార్యసిద్ధి దీపం. ఈ దీపాన్ని ఎలా చేయాలి అంటే.. ముందుగా ఒక ఇస్తరాకు తీసుకొని దానిలో బియ్యం పోసి కొబ్బరికాయ పగలగొట్టి నీళ్లు పారబోసి కొబ్బరికాయకి పసుపు కుంకుమ పెట్టి అందులో నెయ్యి వేసి దీపారాధన చేయాలి. నెయ్యి లేకపోతే నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు. దీపానికి పూలు, తాంబూలం ధూపము పండ్లు పెట్టి అమ్మవారి ముందు పెట్టాలి. ఒకవేళ వారాహి అమ్మవారి ఫొటో లేకపోయినా సరే.. ఈ దీపాలనే అమ్మవారిగా భావించి పూజ చేసుకోవచ్చు.

Ashada Varahi Devi Navratri 9 Days Pooja Vidhanam in telugu
Ashada Varahi Devi Navratri 9 Days Pooja Vidhanam in telugu

ఇష్టానుసారంగా పూజిస్తే అరిష్టాలు తప్పవు జాగ్రత్త.. :
ఈ దీపారాధన చేసే విధానానికి సంబంధించి అనేక పుస్తకాల్లో ఉన్నాయి. కొబ్బరికాయలో నెయ్యి వేసి దీపారాధన చేస్తే అనుకున్న కోరిక సిద్ధిస్తుందని అంటారు. ముందుగా పసుపు గణపతికి పూజ చేయాలి. మొదటి రోజు చేసిన పసుపు గణపతికి 9 రోజులు పూజ చేసుకోవచ్చు. శ్రీ సూక్త విధానం ప్రకారం.. షోడ శోభిచార పూజ చేసుకోవచ్చు. పూజ తర్వాత స్తోత్రాలు అష్టకాలతో పారాయణం చేసుకోవచ్చు. వారాహి ప్రత్యంగిరా లాంటి ఉగ్రదేవతలను పూజించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు పూజ చేసుకోవడం చేతనైతేనే చోట సోపు చార పూజ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇష్టానుసారంగా పూజిస్తే అనుకున్నది జరగకపోగా అరిష్టాలు జరుగుతాయి. కాబట్టి సరైన గురువును సంప్రదించి ఆయన చెప్పినట్లు పూజిస్తే మంచిది.

స్తోత్రాలు నామాలతో పుష్పాలు సమర్పించి పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి ఇష్టమైన పూలు తెల్ల తామర లేదా గులాబీలు చామంతులు ఏపూరితైన చేసుకోవచ్చు. మీకు స్తోత్రాలు చదవడం కూడా రాకపోతే ఓం వారాహి నమః అనుకుంటూ పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి నైవేద్యం ఏం పెట్టాలి అంటే.. ఈ అమ్మవారికి ఏమైనా నైవేద్యం పెట్టవచ్చు. దానిమ్మ గింజలు, బెల్లం పొంగలి, చక్కెర పొంగలి, గేదె పాలు లేదా గేద పాలతో తయారుచేసిన పెరుగన్నం కూడా పెట్టవచ్చు. ఇలా 9 రోజులు పూజించాక 10వ రోజు మహా పూజ చేసుకొని ఉద్యాపన చెప్పాలి. ఒకవేళ పదో రోజు మంగళ, శుక్రవారంలో వస్తే తరువాత రోజు ఉద్యాపన చేయడం మంచిది. ఈ నవరాత్రుల్లో వారాహి గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని పూజ చేయించుకుంటే.. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. వారాహి దేవిని పూజించేటప్పుడు ఇతరులపై కోపడకూడదు. ఇతరుల నాశనాన్ని కోరుకోకూడదు.

మనం బాగుండాలి. మనతో పాటు అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో పూజ చేయండి. పంచముఖ దీపం పూజకు ముఖ్యమైనది. ఒకే రకమైన ఒత్తిని ఉపయోగించి దీపాన్ని వెలిగించాలి. అరటి కాండం వత్తి కానీ పత్తితో చేసిన ఒత్తిని గాని ఉపయోగించాలి. పత్తి ఒత్తి కన్నా అరటి కాండం ఒత్తి మంచిది. అరటి కాండం ఒత్తికంటే తామర వత్తి మంచిది. వారాహి అమ్మ సప్త మాతృకల్లో ఐదవ మాతృక ఆమె పంచమి తల్లి పంచమి దీపం వెలిగిస్తే పంచ పాపాలు తొలగిపోతాయి. పూజ చేసేటప్పుడు పసుపు రంగు, ఎరుపు రంగు, నీలం రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే మనకు ఆటంకాలు తొలగి శత్రువుల నుంచి భయం వంటివి తొలిగిపోతాయి.

అమ్మవారి ఆలయాలు ఎక్కడంటే? :
ఇప్పుడు అమ్మవారి ఆలయాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. మీరు బెంగళూరులో ఉంటే.. మల్లేశ్వరం ఏరియాలో మంత్రి మాల్కో అర కిలోమీటర్ దూరంలో వారాహి అమ్మవారు దేవాలయం ఉంది. అలాగే, హైదరాబాద్ నగరంలో అయితే కొత్తపేట రామకృష్ణాపురంలో వారాహి ప్రత్యంగిరా దేవి ఆలయం ఉంది. వరంగల్ సమీపంలో అయితే, రిగొండలో శ్వేత లక్ష్మీవారహీ దేవాలయం ఉంది. ఇక తిరుపతిలో శ్రీ శక్తి పీఠంలో ఈ వారాహి నవరాత్రుల్లో విశేష పూజలు జరుగుతాయి. ఇది కాక, దక్షిణ భారతదేశంలోనే వారాహి అమ్మవారి దేవాలయం చాలా పెద్దది, అంతే పురాతనమైంది. అమ్మవారి ఆలయాల్లో తంజావూరులోని వారాహి అమ్మవారికి విశేష పూజలు జరుగుతాయి.

Read Also : Varahi Devi Pooja Vidhanam : ఆపదలు తొలగించే వారాహి దేవి అమ్మవారి పూజా విధానం.. ఈ పరిహారం చేస్తే మీ లైఫ్‌లో ఇక తిరుగుండదు..!

The post Varahi Devi Navaratri Pooja : వారాహి నవరాత్రుల పూజ విధానం.. ఆషాడ మాసంలో వారాహి అమ్మవారిని ఎలా పూజించాలి? ఏ రోజు పూజా విధానం ఎలా? appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
https://mearogyam.com/spiritual-news/varahi-devi-navaratri-pooja-ashada-varahi-devi-navaratri-9-days-puja-vidhanam-in-telugu.html/feed 0