నల్ల తుమ్మ బంక – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com MeArogyam Sat, 13 Nov 2021 07:51:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.3 https://mearogyam.com/wp-content/uploads/2021/11/cropped-mearogyam-favicon-1-32x32.png నల్ల తుమ్మ బంక – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com 32 32 Nall Tumma Babul Uses : నల్ల తుమ్మ చెట్టు బెరడు, పువ్వులు, గమ్‌తో ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలున్నాయో తెలుసా..! https://mearogyam.com/ayurvedic-tips/nall-tumma-babul-uses-nalla-thumma-chettu-ayurvedic-uses-in-telugu.html https://mearogyam.com/ayurvedic-tips/nall-tumma-babul-uses-nalla-thumma-chettu-ayurvedic-uses-in-telugu.html#respond Sat, 13 Nov 2021 07:47:51 +0000 https://mearogyam.com/?p=1295 Nall Tumma Babul Uses : నల్ల తుమ్మ చెట్టు బెరడు, పువ్వులు, గమ్‌తో ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలున్నాయో తెలుసా..!
MeArogyam Health News Telugu - MeArogyam.com

Nall Tumma Babul Uses : మన దేశంలో అతి పురాతనమైన వైద్యం ఏదంటే అందరికీ వెంటనే గుర్తొచ్చేది ఆయుర్వేదం. వివిధ రకాల మొక్కలు, ఔషధ గుణాలు కలిగిన చెట్ల నుంచి మందులను తయారు చేసి అప్పట్లో రోగాలను నయం చేసేవారు. అదే పద్ధతిని ఇప్పుడు కూడా ఉపయోగిస్తున్నారు. ఇంగ్లీష్ మెడిసిన్స్ వచ్చాక ఆయుర్వేదం మందులు వాడటం కొంచెం తగ్గినా, ఇంగ్లీష్ మందులతో నయం కానీ రోగాలను సైతం ఆయుర్వేదంతో నయం చేయవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అంతటి […]

The post Nall Tumma Babul Uses : నల్ల తుమ్మ చెట్టు బెరడు, పువ్వులు, గమ్‌తో ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలున్నాయో తెలుసా..! appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
Nall Tumma Babul Uses : నల్ల తుమ్మ చెట్టు బెరడు, పువ్వులు, గమ్‌తో ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలున్నాయో తెలుసా..!
MeArogyam Health News Telugu - MeArogyam.com

Nall Tumma Babul Uses : మన దేశంలో అతి పురాతనమైన వైద్యం ఏదంటే అందరికీ వెంటనే గుర్తొచ్చేది ఆయుర్వేదం. వివిధ రకాల మొక్కలు, ఔషధ గుణాలు కలిగిన చెట్ల నుంచి మందులను తయారు చేసి అప్పట్లో రోగాలను నయం చేసేవారు. అదే పద్ధతిని ఇప్పుడు కూడా ఉపయోగిస్తున్నారు. ఇంగ్లీష్ మెడిసిన్స్ వచ్చాక ఆయుర్వేదం మందులు వాడటం కొంచెం తగ్గినా, ఇంగ్లీష్ మందులతో నయం కానీ రోగాలను సైతం ఆయుర్వేదంతో నయం చేయవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అంతటి పవర్ మన ప్రాచీన సంప్రదాయ వైద్యానికి ఉందన్న మాట..

ఆయుర్వేదంలో ఉపయోగించే మూలికలు, చెట్లు, మొక్కలు దాదాపు మన ఇంటి చుట్టుపక్కల కనిపించేవే ఉంటాయి. మనకు వాటి ఉపయోగం తెలియకపోగా పిచ్చి మొక్కలు అనుకుంటాం. కానీ ఏ మొక్కలో ఏ ఔషధగుణం ఉందో ఆయుర్వేద వైద్యులకు మాత్రమే తెలుసు. నేటి సమాజంలో చాలా మంది అనారోగ్యాల బారిన పడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ లక్షలు తగలేస్తున్నా వ్యాధులు నయం కావడం లేదు. అలాంటి వాటికి ఆయుర్వేదంలో మంచి సమాధానం లభిస్తుందట.. అయితే, పల్లెటూర్లలో కనిపించే నల్ల తుమ్మ చెట్టుతో కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

సాధారణంగా ఈ చెట్టుకు దట్టమైన ముళ్లు ఉంటాయి. పొడవాటి కాయలు కాస్తాయి. పువ్వులు పసువురంగులో ఉంటాయి. అయితే, ఈ చెట్టు నుంచి తీసిన ‘జిగురు’తో విరేచనాలు, కుష్టు వ్యాధి, పేగు వ్యాధులు, దగ్గు, క్యాన్సర్లు, కణతులు, జలుబు, క్షయ, ప్లీహం , కాలేయం, జ్వరాలు, పిత్తాశయం వంటి సమస్యలను దూరం చేసే శక్తి దీనికి ఉందట.. అదే విధంగా మహిళలకు రుతుక్రమంలో తలెత్తే పెయిన్స్‌ను నివారణకు ఈ చెట్టు లేత ఆకులను మెత్తగా నూరి దాని రసాన్ని తీసుకుంటే నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి.

అలాగే రక్తస్రావం,ల్యుకోరియా, స్క్లెరోసిస్, ఆప్తాల్మియా, మశూచి, నపుంసకత్వం వంటి వ్యాధులు కూడా దూరం అవుతాయి. నల్ల తుమ్మ విత్తనాలు మొలకెత్తిన తర్వాత కూరల్లో వాడుకోవచ్చు. వాటిని మద్యం తయారీలో కూడా వాడతారు. నల్ల తుమ్మ బెరడుతో కషాయం తయారు చేసి రోజూ పుక్కిలించి ఉంచితే నోటి అల్సర్లు తగ్గుతాయి. ఈ చెట్టు బెరడును కాగితం తయారీలో కూడా వాడుతుంటారు.

నల్ల తుమ్మచెట్లు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతుంటాయి. పొలాల గట్లపక్కన విరివిగా కనిపిస్తుంటాయి. ఈ నల్ల తుమ్మ నుంచి జిగురు కారుతుంటుంది. దీన్ని బంక అని కూడా పిలుస్తారు. చాలామంది ఈ బంకను చిరిగిన పుస్తకాలు, అట్టా ముక్కలను కూడా అతికించేందుకు వాడుతుంటారు. నల్లతుమ్మ బంకతో పాటు బెరడు వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. నల్ల తుమ్మ చెట్లలోని ప్రతి భాగం ఆయుర్వేదంలో అద్భుతంగా పనిచేస్తాయి.

ఒక్కో భాగం శరీరంలో కలిగే అనేక రోగ రుగ్మతలను నయం చేయగల ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయనే చెప్పాలి. నల్ల తుమ్మతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నిఇన్నీ కావు.. నల్లతుమ్మ బెరడు లేదా జిగురు సేకరించే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సేకరించిన జిగురును శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఆకుల రసాన్ని కూడా బాగా శుభ్రపరిచి వడకట్టాల్సి ఉంటుంది. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా స్వల్ప దుష్ప్రభావాలను నివారించుకోవచ్చు.
Read Also : Karthika Masam 2021 : కార్తీక మాసంలోనే వనభోజనాలు ఎందుకెళ్తారో మీకు తెలుసా?

The post Nall Tumma Babul Uses : నల్ల తుమ్మ చెట్టు బెరడు, పువ్వులు, గమ్‌తో ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలున్నాయో తెలుసా..! appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
https://mearogyam.com/ayurvedic-tips/nall-tumma-babul-uses-nalla-thumma-chettu-ayurvedic-uses-in-telugu.html/feed 0