జబర్దస్త్ కమెడియన్ – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com MeArogyam Fri, 05 May 2023 03:10:29 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.3 https://mearogyam.com/wp-content/uploads/2021/11/cropped-mearogyam-favicon-1-32x32.png జబర్దస్త్ కమెడియన్ – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com 32 32 Jabardasth Punch Prasad : తీవ్ర అనారోగ్యంతో మళ్లీ ఆస్పత్రిలో జబర్దస్త్ పంచ్ ప్రసాద్.. భరించలేని నొప్పతో నడవలేక అవస్థలు..! https://mearogyam.com/entertainment/jabardasth-punch-prasad-admitted-in-hospital-in-telugu.html https://mearogyam.com/entertainment/jabardasth-punch-prasad-admitted-in-hospital-in-telugu.html#respond Sun, 09 Apr 2023 17:16:29 +0000 https://mearogyam.com/?p=4490 Jabardasth Punch Prasad : తీవ్ర అనారోగ్యంతో మళ్లీ ఆస్పత్రిలో జబర్దస్త్ పంచ్ ప్రసాద్.. భరించలేని నొప్పతో నడవలేక అవస్థలు..!
MeArogyam Health News Telugu - MeArogyam.com

Jabardasth Punch Prasad : నవ్వులు పంచే కమెడియన్ జీవితంలో అన్ని కష్టాలే.. ఒకవైపు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్న జబర్ధస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ (Punch Prasad) అందరికి నవ్వులను పంచుతున్నాడు. తీవ్రమైన కిడ్నీ సమస్యలతో ఇబ్బందిపడుతున్నప్పటికీ.. తన కామెడీని పండించడం ఆపలేదు. అదే ధైర్యంతో ముందుకు దూసుకెళ్తున్నాడు. కానీ, ఒకటి తర్వాత మరొకటి అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. దాంతో అనేక ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నాడు. ఆరోగ్యం బాగున్నంటే ఉంటుంది.. ఒక్కోసారి తీవ్రమైన నొప్పిని భరించలేక అల్లాడిపోతున్నాడు. […]

The post Jabardasth Punch Prasad : తీవ్ర అనారోగ్యంతో మళ్లీ ఆస్పత్రిలో జబర్దస్త్ పంచ్ ప్రసాద్.. భరించలేని నొప్పతో నడవలేక అవస్థలు..! appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
Jabardasth Punch Prasad : తీవ్ర అనారోగ్యంతో మళ్లీ ఆస్పత్రిలో జబర్దస్త్ పంచ్ ప్రసాద్.. భరించలేని నొప్పతో నడవలేక అవస్థలు..!
MeArogyam Health News Telugu - MeArogyam.com

Jabardasth Punch Prasad : నవ్వులు పంచే కమెడియన్ జీవితంలో అన్ని కష్టాలే.. ఒకవైపు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్న జబర్ధస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ (Punch Prasad) అందరికి నవ్వులను పంచుతున్నాడు. తీవ్రమైన కిడ్నీ సమస్యలతో ఇబ్బందిపడుతున్నప్పటికీ.. తన కామెడీని పండించడం ఆపలేదు. అదే ధైర్యంతో ముందుకు దూసుకెళ్తున్నాడు. కానీ, ఒకటి తర్వాత మరొకటి అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. దాంతో అనేక ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నాడు.

ఆరోగ్యం బాగున్నంటే ఉంటుంది.. ఒక్కోసారి తీవ్రమైన నొప్పిని భరించలేక అల్లాడిపోతున్నాడు. కిడ్నీలు చెడిపోవడంతో ఆయనకు తప్పనిసరిగా డయాలసిస్ చేయాలని వైద్యులు సూచించారు. అలా చేయకపోతే మాత్రం ప్రసాద్ ప్రాణాలే ప్రమాదమని చెప్పారట.. అప్పటినుంచి ఆయన క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటున్నారు. పంచ్ ప్రసాద్‌ (Comedian Punch Prasad) కు తోడునీడగా ఆయన భార్య దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు. చంటిపిల్లాడిలా చాలా జాగ్రత్తగా కంటికిరెప్పలా కాపాడుకుంటున్నారు. పంచ్ ప్రసాద్‌కు సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో ఆయనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తుంటారు.

Jabardasth Punch Prasad Admitted in Hospital in telugu
Jabardasth Punch Prasad Admitted in Hospital in telugu

లేటెస్టుగా తన ఆరోగ్యానికి సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. ఒక ఇంజెక్షన్ కోసమే ప్రసాద్ ఆస్పత్రిలో చేరినట్లుగా కనిపిస్తోంది. ఇంజక్షన్ కోసం వచ్చామని, కుడిచేతిపై 50 ఇంజెక్షన్స్ వేశారని పంచ్ ప్రసాద్ భార్య తెలిపారు. డయాలసిస్ నొప్పి తట్టుకోలేకపోతున్నారని, డయాలసిస్ తర్వాత క్లీడ్ ఇస్తే బాగుంటుందని తెలిపారు. కానీ, ప్రసాద్ ఇంజెక్షన్స్ వేయించుకోవాలంటేనే చాలా భయపడిపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పంచ్ ప్రసాద్ కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని, భార్య తెలిపారు. కొద్దిరోజుల క్రితం తీవ్రమైన జ్వరం వచ్చిందని, దాంతో ఆస్పత్రిలో చేరారని, ప్రస్తుతం పంచ్ ప్రసాద్ కోలుకున్నారని ఆమె తెలిపారు.

ఇప్పటికే కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్న పంచు ప్రసాద్‌కు మ‌రో అనారోగ్య స‌మ‌స్య ఉన్న‌ట్లు తేలింది. థైరాయిడ్‌ సమస్య కారణంగా ట్రీట్‌మెంట్ కోసం ప్రైమ్ హాస్పిట‌ల్‌కు వచ్చినట్టు చెప్పారు. థైరాయిడ్ సమస్య మందులతో తగ్గితే పర్వాలేదని, అలా తగ్గకపోతే మాత్రం పంచ్ ప్రసాద్‌కు ఆపరేషన్ చేయాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. జ‌బ‌ర్ద‌స్త్ (Jabardasth)లో తనదైన పంచులతో నవ్వించే పంచ్ ప్ర‌సాద్ తీవ్ర‌మైన ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధపడటం చూసి ఆయన అభిమానులు సైతం సానుభూతిని తెలియజేస్తున్నారు. పంచ్ ప్రసాద్ తొందరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నారు.

Read Also : Sitara Ghattamaneni : మహేష్ బాబు కూతురు సితారపై భారీగా ట్రోల్స్.. ఇంతకీ, స్టార్ కిడ్‌ చేసిన తప్పేంటి?

The post Jabardasth Punch Prasad : తీవ్ర అనారోగ్యంతో మళ్లీ ఆస్పత్రిలో జబర్దస్త్ పంచ్ ప్రసాద్.. భరించలేని నొప్పతో నడవలేక అవస్థలు..! appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
https://mearogyam.com/entertainment/jabardasth-punch-prasad-admitted-in-hospital-in-telugu.html/feed 0