చికెన్‌ పకోడీ – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com MeArogyam Mon, 24 Jul 2023 08:22:04 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.3 https://mearogyam.com/wp-content/uploads/2021/11/cropped-mearogyam-favicon-1-32x32.png చికెన్‌ పకోడీ – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com 32 32 Chicken Pakoda : చికెన్‌ పకోడీని ఇలా మసాలాతో బాగా పట్టించి చేశారంటే.. స్ట్రీట్ స్టయిల్లో క్రిస్పీ‌ క్రిస్పీ‌గా ఎంతో స్పైసీగా ఉంటాయి..! https://mearogyam.com/food-recipes/chicken-pakora-recipe-street-style-in-telugu.html https://mearogyam.com/food-recipes/chicken-pakora-recipe-street-style-in-telugu.html#respond Mon, 24 Jul 2023 08:25:57 +0000 https://mearogyam.com/?p=6569 Chicken Pakoda : చికెన్‌ పకోడీని ఇలా మసాలాతో బాగా పట్టించి చేశారంటే.. స్ట్రీట్ స్టయిల్లో క్రిస్పీ‌ క్రిస్పీ‌గా ఎంతో స్పైసీగా ఉంటాయి..!
MeArogyam Health News Telugu - MeArogyam.com

Chicken Pakoda : చికెన్ పకోడీని ఎప్పుడైనా ట్రై చేశారా? స్ట్రీట్ స్టయిల్లో కొంచెం డిఫరెంట్ చికెన్ పకోడీని తయారుచేసుకోవచ్చు. ముందుగా 700 గ్రాములు చికెన్ తీసుకోవాలి. మీడియం సైజులో ముక్కలు కొట్టించుకోండి. అప్పుడే చికెన్ బాగా వేగుతుంది. బోన్స్‌తో ఉంటే చికెన్ మంచి టేస్ట్ వస్తుంది. బోన్ లెస్ అయినా పర్వాలేదు. ఒక టీ స్పూన్ నూనె, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం, ఇంకా బాగా స్పైసీగా కావాలి అంటే […]

The post Chicken Pakoda : చికెన్‌ పకోడీని ఇలా మసాలాతో బాగా పట్టించి చేశారంటే.. స్ట్రీట్ స్టయిల్లో క్రిస్పీ‌ క్రిస్పీ‌గా ఎంతో స్పైసీగా ఉంటాయి..! appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
Chicken Pakoda : చికెన్‌ పకోడీని ఇలా మసాలాతో బాగా పట్టించి చేశారంటే.. స్ట్రీట్ స్టయిల్లో క్రిస్పీ‌ క్రిస్పీ‌గా ఎంతో స్పైసీగా ఉంటాయి..!
MeArogyam Health News Telugu - MeArogyam.com

Chicken Pakoda : చికెన్ పకోడీని ఎప్పుడైనా ట్రై చేశారా? స్ట్రీట్ స్టయిల్లో కొంచెం డిఫరెంట్ చికెన్ పకోడీని తయారుచేసుకోవచ్చు. ముందుగా 700 గ్రాములు చికెన్ తీసుకోవాలి. మీడియం సైజులో ముక్కలు కొట్టించుకోండి. అప్పుడే చికెన్ బాగా వేగుతుంది. బోన్స్‌తో ఉంటే చికెన్ మంచి టేస్ట్ వస్తుంది. బోన్ లెస్ అయినా పర్వాలేదు. ఒక టీ స్పూన్ నూనె, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం, ఇంకా బాగా స్పైసీగా కావాలి అంటే కొద్దిగా వేసుకోవచ్చు.

అలాగే, వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి ఒకటిన్నర టీ స్పూన్, వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వేసుకోవాలి.  మసాలా ఫ్లేవర్ మరీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు.  కలర్ కోసం కాశ్మీరీ చిల్లి పౌడర్ 2 టీ స్పూన్లు వేసుకోవాలి. దీంట్లోనే చిల్లి ఫ్లెక్స్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఒకవేళ చిల్లీ ఫ్లెక్స్ లేనట్లయితే ఎండు మిరపకాయలని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవచ్చు.

chicken pakora recipe street style in telugu
chicken pakora recipe street style in telugu

రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక రెండు రెమ్మలు కరివేపాకు తీసుకొని సన్నగా కట్ చేసి వేయాలి. కొత్తిమీరను కూడా కొద్దిగా తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి. కొద్ది నిమ్మకాయను తీసుకొని రసాన్ని పిండుకోండి. గుడ్డు పగలగొట్టి వేసుకోండి. ఒక్క రెండు టేబుల్ స్పూన్లలో కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ వేస్తే చాలా క్రిస్పీగా వస్తుంది  లేదంటే బియ్యం పిండి వేసుకోవచ్చు. ఒక రెండు టేబుల్ స్పూన్లు శెనగపిండి కూడా కలిపాలి. అన్ని వేసుకున్న తర్వాత  బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్లు శనగపిండి సరిపోతుంది. ఈ చికెన్ ముక్కలకి అన్ని బాగా పట్టేటట్టు కలిపేసుకున్న తర్వాత గిన్ని మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి.

Chicken Pakoda : స్ట్రీట్ స్టయిల్లో చికెన్‌ పకోడీ తయారీ ఇలా.. 

ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాస్త కాగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇలా కొద్దికొద్దిగా వేసుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి. ఫస్ట్ ఆయిల్ బాగా కాగిన తర్వాత వేసుకోవాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించాలి. వేసిన వెంటనే తిప్పకండి. ఒక 2 నిమిషాలు ఆగి నిదానంగా తిప్పుకుంటూ వేయించుకోవాలి. కలర్ వచ్చేదాకా వేగితే సరిపోతుంది. లోపల సాఫ్ట్ పైపైనా క్రిస్పీగా ఉండేలా వేయించుకుంటే సరిపోతుంది.

చికెన్ ముక్కను నోట్లో వేసుకొని చూస్తే తెలిసిపోతుంది. వేగేటప్పుడే వేగాయా లేదా చెక్ చేసుకోవాలి. అన్నింటినీ ఆయిల్ లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్ల వేసేసుకోవాలి. అన్ని వేయించేసుకున్న తర్వాత మిగిలిపోయిన ఆయిల్ లోనే కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయలకు మధ్యలో గాట్లు పెట్టి వేసి వేయించుకోవాలి. గాట్లు పెట్టకపోతే పేలుతాయి. పచ్చిమిర్చిని వేయించేసిన తర్వాత చికెన్ ముక్కల పైన వేసుకోవాలి. అందులో ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసి లైట్‌గా నిమ్మకాయ పిండుకోవాలి. ఉల్లిపాయలతో నంచుకుని తిన్నారంటే చికెన్ పకోడీ చాలా రుచిగా క్రిస్పీగా ఉంటాయి.

Read Also : Chicken Keema Pakoda Recipe : నోరూరించే చికెన్ కీమా పకోడీ.. హోటల్ స్టయిల్లో కరకరలాడేలా క్రిస్పీగా ఉండాలంటే ఇలా చేసుకోండి..!

The post Chicken Pakoda : చికెన్‌ పకోడీని ఇలా మసాలాతో బాగా పట్టించి చేశారంటే.. స్ట్రీట్ స్టయిల్లో క్రిస్పీ‌ క్రిస్పీ‌గా ఎంతో స్పైసీగా ఉంటాయి..! appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
https://mearogyam.com/food-recipes/chicken-pakora-recipe-street-style-in-telugu.html/feed 0