గోరుచిక్కుడు కాయ – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com MeArogyam Sun, 23 Jul 2023 06:29:04 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.3 https://mearogyam.com/wp-content/uploads/2021/11/cropped-mearogyam-favicon-1-32x32.png గోరుచిక్కుడు కాయ – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com 32 32 Goru Chikkudu Pachadi : గోరుచిక్కుడుకాయలతో ఇలా పచ్చడి చేశారంటే.. వదలకుండా తినేస్తారు..! https://mearogyam.com/food-recipes/goru-chikkudu-pachadi-recipe-in-telugu.html https://mearogyam.com/food-recipes/goru-chikkudu-pachadi-recipe-in-telugu.html#respond Sun, 23 Jul 2023 06:27:07 +0000 https://mearogyam.com/?p=6529 Goru Chikkudu Pachadi : గోరుచిక్కుడుకాయలతో ఇలా పచ్చడి చేశారంటే.. వదలకుండా తినేస్తారు..!
MeArogyam Health News Telugu - MeArogyam.com

Goru Chikkudu Pachadi : గోరుచిక్కుడుకాయతో వేపుడు మసాలా కర్రీస్, పులుసు చేసుకోవడం తెలుసు.. గోరుచిక్కుడు పచ్చడి ఎప్పుడైనా చేశారా? మీ ఇంట్లో ఇలా చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే సూపర్‌గా ఉంటుంది. ఈ చిక్కుడుకాయ పచ్చడి కోసం ఫస్ట్ పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఒక పావు కేజీ గోరు చిక్కుడుకాయ ముక్కలు వేసుకుని ఫ్లేమ్ […]

The post Goru Chikkudu Pachadi : గోరుచిక్కుడుకాయలతో ఇలా పచ్చడి చేశారంటే.. వదలకుండా తినేస్తారు..! appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
Goru Chikkudu Pachadi : గోరుచిక్కుడుకాయలతో ఇలా పచ్చడి చేశారంటే.. వదలకుండా తినేస్తారు..!
MeArogyam Health News Telugu - MeArogyam.com

Goru Chikkudu Pachadi : గోరుచిక్కుడుకాయతో వేపుడు మసాలా కర్రీస్, పులుసు చేసుకోవడం తెలుసు.. గోరుచిక్కుడు పచ్చడి ఎప్పుడైనా చేశారా? మీ ఇంట్లో ఇలా చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే సూపర్‌గా ఉంటుంది. ఈ చిక్కుడుకాయ పచ్చడి కోసం ఫస్ట్ పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఒక పావు కేజీ గోరు చిక్కుడుకాయ ముక్కలు వేసుకుని ఫ్లేమ్ ఫ్లేమ్ లో పెట్టి ఒక్క 2 నిమిషాలు వేగనివ్వండి.

ఎందుకంటే.. ఈ చిక్కుడుకాయ ముక్కల్లో ఉన్న పచ్చి వాసన అనేది కొంచెం తగ్గుతుంది. ఇలా వేయించుకునేటప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు, ఆఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు చిక్కుడుకాయ ముక్కలను వేయించుకున్న తర్వాత లో ఫ్లేమ్ లోనే ఉంచి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసి కలిపి మళ్ళీ మూత పెడుతూ మగ్గించుకోండి. గోరుచిక్కుడుకాయ ముక్కలు మెత్తగా మగ్గిపోవాలంటే మూత పెట్టి ఉంచాలి.

చిక్కుడుకాయ ముక్కలు బాగా మగ్గిపోతేనే పచ్చడి టేస్ట్ ఉంటుంది. లేదంటే.. పచ్చి వాసన అట్లనే ఉంటుంది. బాగా మగ్గించేసుకొని అన్నింటిని తీసేసి ఏదైనా గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే పాన్‌లో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు కారం ఎంత తినగలరో చూసుకొని వేసుకోవాలి. ఆరు నుంచి ఏడు పచ్చిమిరపకాయలు దాకా వేసుకోవచ్చు. కొద్దిగా కారం ఎక్కువ ఉన్నాయి. కొంచెం తక్కువే వేసుకుంటున్నాను. పచ్చళ్ళకి ఎప్పుడైనా కారం కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. పచ్చళ్ళు బట్టి చూసుకొని వేసుకోండి. తుంచి వేసుకోండి పేలకుండా ఉంటాయి

Goru Chikkudu Pachadi : చిక్కుడుకాయ పచ్చడి తయారీ విధానం.. 

ఇప్పుడు దీంట్లోనే 1 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి. ఒక్క చిటికెడు మెంతులు వేసుకోవాలి. మెంతులు ఎక్కువేస్తే చేదు వస్తుంది. చిటికెడు వేస్తే సరిపోతుంది. ఇందులోనే ఒక్క టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి లో ఫ్లేమ్ లో పెట్టి వేగనివ్వండి. మాడకుండా నిదానంగా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు 6 వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కాస్త వేగిన తర్వాత ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా వేసి కలిపేసేయండి. వేగేటప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని వేయించేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అన్నింటిని మిక్సీ జార్‌లోకి తీసుకోండి.

Goru Chikkudu Pachadi
Goru Chikkudu Pachadi

మీరు సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ చిక్కుడుకాయ ముక్కలన్నింటినీ వేసుకొని మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండేటట్టు వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి. డైరెక్ట్ గా ఇలానే పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసేసిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేయండి. ఉల్లిపాయ వేస్తే టేస్ట్ భలే ఉంటుంది. డైరెక్ట్‌గా పచ్చని పోపు పెట్టుకుంటే.. ఆ టేస్ట్ బాగుంటుంది. మిక్సీకి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు. చిన్న చిన్న ముక్కలుగా ఉండాలి.

ఇలా చేసుకున్న పచ్చడి పెట్టేసి ఇప్పుడు బాండిలో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ మినపప్పు, ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత 2 లేదా 3 ఎండు మిరపకాయలు తుంచుకొని వేసుకుని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ పోపు మొత్తం వేగిన తర్వాత ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని వేసుకోవాలి. మొత్తం బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే సూపర్‌గా ఉంటుంది.

Read Also : Allam Pachadi : ఏ టిఫిన్లలోకైనా అల్లం పచ్చడి కమ్మగా ఉండాలంటే ఇలా చేయండి.. మెతుకు వదలకుండా తినేస్తారు!

The post Goru Chikkudu Pachadi : గోరుచిక్కుడుకాయలతో ఇలా పచ్చడి చేశారంటే.. వదలకుండా తినేస్తారు..! appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
https://mearogyam.com/food-recipes/goru-chikkudu-pachadi-recipe-in-telugu.html/feed 0