కోవిడ్ రికవరీ ఎక్సర్ సైజులు – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com MeArogyam Tue, 16 Nov 2021 23:04:31 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.3 https://mearogyam.com/wp-content/uploads/2021/11/cropped-mearogyam-favicon-1-32x32.png కోవిడ్ రికవరీ ఎక్సర్ సైజులు – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com 32 32 COVID-19 Recovery Home Exercises : ఈ వ్యాయామాలు చేస్తే కరోనా రాదట.. వచ్చినా వెంటనే కోలుకోవచ్చు! https://mearogyam.com/coronavirus-updates/covid-19-recovery-home-exercises.html https://mearogyam.com/coronavirus-updates/covid-19-recovery-home-exercises.html#respond Tue, 21 Sep 2021 04:14:08 +0000 https://mearogyam.com/?p=528 COVID-19 Recovery Home Exercises : ఈ వ్యాయామాలు చేస్తే కరోనా రాదట.. వచ్చినా వెంటనే కోలుకోవచ్చు!
MeArogyam Health News Telugu - MeArogyam.com

COVID-19 Recovery Home Exercises  : కరోనావైరస్ మహమ్మారి ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. కరోనా కేసులు కూడా క్రమంగా తగ్గిపోతున్నాయి. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ చాలామంది ఇప్పటికీ లక్షణాల ప్రభావాన్ని ఎదుర్కొంటునే ఉన్నారు. కరోనా నుంచి బయటపడినా లక్షణాల నుంచి బయటపడాలంటే వ్యాయామం ద్వారా తగ్గించుకోవచ్చునని అంటున్నారు. ఇంట్లో నుంచి కరోనా లక్షణాలను తగ్గించుకోవాలంటే ఈ తరహా ఎక్సర్ సైజులు చేసుకోవచ్చు. కరోనా వంటి అనేక మహమ్మారుల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే తప్పనిసరిగా అందరూ వ్యాయామం చేయాలని […]

The post COVID-19 Recovery Home Exercises : ఈ వ్యాయామాలు చేస్తే కరోనా రాదట.. వచ్చినా వెంటనే కోలుకోవచ్చు! appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
COVID-19 Recovery Home Exercises : ఈ వ్యాయామాలు చేస్తే కరోనా రాదట.. వచ్చినా వెంటనే కోలుకోవచ్చు!
MeArogyam Health News Telugu - MeArogyam.com

COVID-19 Recovery Home Exercises  : కరోనావైరస్ మహమ్మారి ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. కరోనా కేసులు కూడా క్రమంగా తగ్గిపోతున్నాయి. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ చాలామంది ఇప్పటికీ లక్షణాల ప్రభావాన్ని ఎదుర్కొంటునే ఉన్నారు. కరోనా నుంచి బయటపడినా లక్షణాల నుంచి బయటపడాలంటే వ్యాయామం ద్వారా తగ్గించుకోవచ్చునని అంటున్నారు. ఇంట్లో నుంచి కరోనా లక్షణాలను తగ్గించుకోవాలంటే ఈ తరహా ఎక్సర్ సైజులు చేసుకోవచ్చు.

కరోనా వంటి అనేక మహమ్మారుల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే తప్పనిసరిగా అందరూ వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. అది వాకింగ్ కావొచ్చు.. రన్నింగ్ కావొచ్చు.. కసరత్తులు కావొచ్చు.. ఏ వ్యాయామం చేసినా అది మీ ఆరోగ్య పరిస్థితి తగినట్టుగా చేయాల్సి ఉంటుంది. లేదంటే ఇతర అనారోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం లేకపోలేదు.

అలాగే కరోనా రాకుండా కూడా ఈ వ్యాయామాల ద్వారా నివారించుకోవచ్చునని సూచిస్తున్నారు. కరోనావైరస్ సోకినవారిలో చాలామందిలో కోలుకున్నాప్పటికీ కూడా వారిలో లక్షణాలు వెంటాడుతూనే ఉన్నాయి. కరోనా నుంచి బయటపడ్డామనే రిలీఫ్ అయ్యే పరిస్థితి లేదు. కరోనాతో సహజీవనం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు.  కరోనావైరస్ నుంచి తొందరగా కోలుకోవాలంటే ఈ వ్యాయామాలు చేయాలంట. కొవిడ్ పాజిటివ్ వచ్చనవారు ఇంట్లోనే ఉంటూ ఈ చిన్నపాటి ఎక్సర్ సైజులు చేయడం ద్వారా తొందరగా రిలీఫ్ పొందవచ్చు.

ఒకవైపు వైద్యుని సలహాలు పాటిస్తూనే మరోవైపు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. కొవిడ్ పాజిటివ్ ఉన్నవారు ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. వ్యాయామాలు చేయడం ద్వారా
ఒత్తిడి తగ్గించుకోవచ్చు. తొందరగా కోలుకోవాలంటే కొంత ఫిజికల్ యాక్టివిటీ అవసరం పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా నుంచి కోలుకోవడానికి మరికొన్ని వ్యాయామాలు ఉన్నాయి.. అవేంటో ఓసారి చూద్దాం..

1. యోగా (Yoga) :
కరోనా నుంచి కోలుకునే క్రమంలో చాలామందిని యోగా చేయాలని సూచిస్తుంటారు. ఇలా చేయడం వల్ల మానసికంగా ఎంతో ఉత్సాహంగా ఉండొచ్చు. ఆరోగ్యంగా, మానసికంగా ఉండాలంటే తప్పనిసరిగా యోగాసనాలు చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. కరోనాకు చికిత్స తీసుకుంటూనే యోగా చేయాలన సూచిస్తున్నారు. యోగా చేసే అలవాటు లేకపోతే.. ఏదైనా బిగినర్స్ క్లాస్‌లో నేర్చుకోవచ్చు. మీ సౌకర్యాన్ని బట్టి యోగా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే ఆపివేయచ్చు. యోగాసనాల్లో అనేక భంగిమలు ఉన్నాయి.

అన్ని రకాల భంగిమలు ప్రయత్నించవద్దు. లేదంటే మీ శరీరం పట్టేసే ప్రమాదం ఉంది. నిపుణుల సమక్షంలో మాత్రమే ట్రైనింగ్ తీసుకుని యోగసానాలను ప్రయత్నించాలి. ఏదైనా ఒక యోగాసనం వేసినప్పుడు సరైన పద్ధతిలో చేయాలి. ముఖ్యంగా కరోనా వంటి అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలంటే శ్వాసపరమైన యోగసానాలను ఎక్కువగా చేయాలి. శ్వాస లోతుగా తీసుకోవడం.. వదలడం వంటి అనేక చిన్నపాటి సులభమైన యోగసానాలు ఎన్నో ఉన్నాయి. అందులో మీకు సౌకర్యవంతంగా అనిపించినది ఒకటి ఎంచుకోవాలి. మీ శరీరానికి ఇబ్బంది కలిగించని యోగసానాలను ఎంచుకునేందుకు ప్రయత్నించండి.

2. నడవాలి (Walking) :
నడక.. ప్రతిఒక్కరి ఆరోగ్యానికి ఇది చాలా అవసరం కూడా. ఎక్కువ సమయం నడిచేవారిలో ఆరోగ్యపరమైన సమస్యలు చాలా తక్కువగా ఉంటాయట.. నడక మంచిదే అంటారు. నడకతో గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. శరీరంలోని అనవసరమైన కొవ్వును కరిగిస్తుంది. కేలరీలు అధికమొత్తంలో ఖర్చు కావడం ద్వారా తొందరగా బరువు తగ్గవచ్చు.

కరోనా బారినపడిన వారు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. అలాగే వ్యాయామం కూడా చేయాలి. ధైర్యంగా ఉండాలి. కరోనా వచ్చిందని బాధపడటం కంటే తొందరగా రికవరీ అయ్యేందుకు ప్రయత్నించాలి.
అందులో భాగంగానే నడక మొదలుపెట్టాలి. ఇంట్లోనే ఉన్న చోటనే అటు ఇటు పది నుంచి పదిహేను నిమిషాలు నడవాలి. ఒకవేళ మీరు నడిచేటప్పుడు ఆయాసం రాకుంటే ఎక్కువ సమయం నడవవచ్చు.

3. శ్వాస తీసుకోవడం (Breathing) :
కరోనావైరస్ అనేది.. శ్వాససంబంధిత వ్యాధి.. ఈ వైరస్ ఎక్కువగా ఊపిరితిత్తులు, రెస్పిరేటరీ సిస్టమ్‌పై ఆధారపడి ఉంటుంది. కపాలభాతి, అలోమ, విలోమ బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు చేయాలి. అప్పుడు మీ
ఊపిరితిత్తులు బలంగా తయారవుతాయి. ఫలితంగా తొందరగా కోలుకోవచ్చు. కరోనా సోకినవారిలో శ్వాస తీసుకోవడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఊపిరితిత్తులకు సరైన శ్వాస అందదు. శ్వాసకోశాలు మూసుకుపోతాయి.

ఈ సమస్య అనేది కరోనా నుంచి కోలుకునేవారిలో అధికంగా ఉండొచ్చు. అందుకే బ్రీతింగ్ వ్యాయామాలు చేస్తుండాలి. శ్వాసను బాగా తీసుకోవడం వదలడం చేయాలి. అప్పుడు మూసుకుపోయిన శ్వాసనాళాలు తెరుచుకుంటాయి. తద్వారా శ్వాస సులభంగా అందుతుంది. కరోనా బాధితుల్లో ఎదురయ్యే ఈ సమస్య నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాలి.

4. మడమలను ఎత్తడం  :
మీ మడమలను పైకి కిందికి ఎత్తడం చేయాలి. ఇలా పది నుంచి 15సార్లు చేయాలి. మునివేళ్ళ మీదనే పైకి లేవాలి. రెండు నుంచి మూడు సార్లు చేయాలి. గట్టిగా ఉండే ఉపరితలం పక్కన నిలబడాలి. అంటే ఏదైనా గోడ కావొచ్చు.. ఒకే కాలి మీద నిలబడేలా ప్రాక్టీస్ చేయాలి. లేదంటే కళ్లు మూసుకుని కూడా చేయొచ్చు. మీ శరీరాన్ని బ్యాలెన్స్ చేసేలా ప్రాక్టీస్ చేయాలి.

మీ మోకాలిని మీ ఛాతీ వరకూ పైకి లేపాలి. ఇలా రెండూ కాళ్లను మార్చి మార్చి చేయడం ద్వారా తొందరగా కోలుకోవచ్చు. కరోనావైరస్ బారినపడినవారిలో శరీర శక్తిని బాగా కోల్పోతారు. కనీసం నిలబడటం కూడా కష్టంగా అనిపిస్తుంది. మీ శరీరాన్ని బ్యాలెన్స్ చేసేందుకు ప్రయత్నించాలి. మడమలను పైకిఎత్తడం ద్వారా మీ శరీరంపై మీకు పట్టు సాధించవచ్చు.

5. క్యాట్ క్యామెల్ (Cat Camel) :
కరోనా నుంచి కోలుకునే బాధితులు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలంటారు. అలా అనీ అదే పనిగా పడుకోకూడదు.. అలానే కూర్చుని ఉండకూడదు. ఎందుకంటే అధిక సమయం అలానే కూర్చొని ఉంటే.. మీ స్పైనల్ మజిల్స్ బిగుతుగా మారుతాయి. అందుకే క్యాట్ క్యామెల్ చేయాలి. ఇలా చేస్తే స్పైనల్ మజిల్స్ మొబిలైజ్ అవుతాయి. అంతేకాదు.. నిత్యం ఈ వ్యాయామం చేస్తే.. మీ పేగుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఒకే చోట ఎక్కువ సమయం కూర్చొనేవారిలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

మీ శరీరంలోని కండరాలు ముడుచుకుపోతాయి. బిగుతుగా మారడం ద్వారా కదల్లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సమయాల్లో క్యాట్ క్యామెల్ వాక్ చేస్తుండాలి. కొంతమందిలో మోకాళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి. అలాంటివారు క్యాట్ క్యామెల్ వాక్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కరోనా నుంచి కోలుకున్నాక ఎక్కువగా కనిపించే లక్షణం.. నీరసం.. ఇలా సమస్య చాలామందిలో ఉండొచ్చు.

కరోనా యాంటీబాడీల స్థాయి అధికంగా లేనప్పుడు వైరస్ ప్రభావాన్ని తట్టుకునేందుకు శరీరం సిద్ధంగా ఉండాలి. ఆ పరిస్థితి లేదని సమయాల్లో చాలా నీరసంగా అనిపిస్తుంటుంది. క్యాట్ క్యామెల్ వంటి వ్యాయామాలను చేయడం ద్వారా స్పైనల్ మజిల్స్ యాక్టివ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా ఈ క్యాట్ క్యామెల్ వాక్ చేయడం అలవాటు చేసుకోవచ్చు. తద్వారా మీ జీర్ణశయ పేగుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

కరోనావైరస్ నుంచి కోలుకున్నాక ప్రతిఒక్కరూ ఒకేచోట ఎక్కువ సమయం కూర్చొవడం లేదా పడుకోవడం చేయరాదు. శరీరానికి విశ్రాంతి అవసరమే కానీ, అది ఒకే భంగిమలో కాదు.. కొద్దికొద్దిగా వ్యాయామం చేయడం మొదలుపెట్టాలి. అలా చేస్తుంటే ఉంటే కరోనావైరస్ ప్రభావం నుంచి తొందరగా బయటపడొచ్చు.

Read Also : Drinking Hot Water : పరిగడుపున వేడి నీళ్లు తాగుతున్నారా? తప్పక తెలుసుకోండి..

The post COVID-19 Recovery Home Exercises : ఈ వ్యాయామాలు చేస్తే కరోనా రాదట.. వచ్చినా వెంటనే కోలుకోవచ్చు! appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
https://mearogyam.com/coronavirus-updates/covid-19-recovery-home-exercises.html/feed 0