ఉప్పు కల్తీ పరీక్ష – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com MeArogyam Sun, 14 May 2023 19:30:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.3 https://mearogyam.com/wp-content/uploads/2021/11/cropped-mearogyam-favicon-1-32x32.png ఉప్పు కల్తీ పరీక్ష – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com 32 32 Iodine Salt Test Telugu : మీరు వాడే ఉప్పులో అయోడిన్ ఉందా? అది కల్తీనా కాదో ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు.. కచ్చితమైన రిజల్ట్స్..! https://mearogyam.com/kitchen-remedies/iodine-salt-test-telugu-how-to-test-iodine-in-salt-at-home-telugu.html https://mearogyam.com/kitchen-remedies/iodine-salt-test-telugu-how-to-test-iodine-in-salt-at-home-telugu.html#respond Sun, 14 May 2023 19:32:41 +0000 https://mearogyam.com/?p=592 Iodine Salt Test Telugu : మీరు వాడే ఉప్పులో అయోడిన్ ఉందా? అది కల్తీనా కాదో ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు.. కచ్చితమైన రిజల్ట్స్..!
MeArogyam Health News Telugu - MeArogyam.com

Iodine in Salt Test : మీరు అయోడెన్ ఉప్పు వాడుతున్నారా? కల్తీతో జాగ్రత్త.. అయోడిన్ ఉప్పులో మామూలు ఉప్పు కూడా కలుస్తోంది. ఆరోగ్యానికి అయోడిన్ ఉప్పు (Iodine Salt) చాలా అవసరం.. లేదంటే.. అయోడిన్ లోపం ఏర్పడే ముప్పు ఉంది. వంటింట్లో వాడే ఉప్పు సాధారణమైనది అయితే ఆరోగ్యపరంగా అనేక సమస్యలకు దారితీయొచ్చునని పోషక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా వంట చేసినప్పుడు అందులో ఎన్ని రకాల రుచులు వేసినా ఉప్పు లేకుంటే వంటకు రుచే రాదంటారు. […]

The post Iodine Salt Test Telugu : మీరు వాడే ఉప్పులో అయోడిన్ ఉందా? అది కల్తీనా కాదో ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు.. కచ్చితమైన రిజల్ట్స్..! appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
Iodine Salt Test Telugu : మీరు వాడే ఉప్పులో అయోడిన్ ఉందా? అది కల్తీనా కాదో ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు.. కచ్చితమైన రిజల్ట్స్..!
MeArogyam Health News Telugu - MeArogyam.com

Iodine in Salt Test : మీరు అయోడెన్ ఉప్పు వాడుతున్నారా? కల్తీతో జాగ్రత్త.. అయోడిన్ ఉప్పులో మామూలు ఉప్పు కూడా కలుస్తోంది. ఆరోగ్యానికి అయోడిన్ ఉప్పు (Iodine Salt) చాలా అవసరం.. లేదంటే.. అయోడిన్ లోపం ఏర్పడే ముప్పు ఉంది. వంటింట్లో వాడే ఉప్పు సాధారణమైనది అయితే ఆరోగ్యపరంగా అనేక సమస్యలకు దారితీయొచ్చునని పోషక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా వంట చేసినప్పుడు అందులో ఎన్ని రకాల రుచులు వేసినా ఉప్పు లేకుంటే వంటకు రుచే రాదంటారు. అలాగే వంటింట్లో వాడే ఉప్పు కూడా అయోడిన్ అయి ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు నిపుణులు. శరీరానికి అయోడెన్ లోపం ఏర్పడితే చాలా సమస్యలు వస్తాయని అంటున్నారు. అందుకే అయోడిన్ ఉప్పును మాత్రమే వాడాలని సూచిస్తున్నారు.

Iodine Salt Test Telugu : how to test iodine in salt at home telugu
Iodine Salt Test Telugu : how to test iodine in salt at home telugu

అయోడిన్ ఉప్పు వాడటం ద్వారా మీ మెదడు చురుకుగా పనిచేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. ఇండియాలో అయోడిన్ లోప నియంత్రణ సంస్థ.. అందరి ఇంట్లో ఉప్పులో ఖచ్చితంగా అయోడిన్ ఉండేలా (salt experiment) జాగ్రత్త పడాలని సూచిస్తోంది. అయోడిన్ ఉప్పు కల్తీ ఉప్పుతో మార్కెట్లోకి వస్తోంది. కల్తీ ఉప్పును అయోడిన్ ఉప్పుగా విక్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉప్పును వినియోగించేవారు తాము వాడే ఉప్పులో అయోడిన్ ఉందో లేదో తప్పక తెలుసుకోవాలి. ఉప్పులో అయోడిన్ లేకుంటే అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. మందబుద్ధి, మానసిక సమస్యలు, జ్ఞాపకశక్తి లోపించడం, చిత్త వైకల్యం వంటి అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది.

Iodine Salt Test Telugu : ఉప్పు కల్తీ అయిందని గుర్తించడం ఎలా? 

ఉప్పు లేకుంటే వంటల్లో ఎలా అయితే రుచి రాదో.. అలాగే శరీరానికి అవసరమైన అయోడిన్ తగినంత స్థాయిలో లభించకపోతే.. తొందరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఉప్పు ఎక్కువగా వాడితే అయోడిన్ ఎక్కువగా లభిస్తుందని భావిస్తుంటారు. అలా చేయడం తప్పు.. ఎందుకంటే.. ఉప్పు ఎక్కువగా వాడితే బీపీ సమస్య పెరిగిపోతుంది. ఉప్పు పరిమితంగానే వాడాలి.. అది కూడా అయోడిన్ కలిగిన ఉప్పును మాత్రమే వాడాలి. మీరు వాడుతున్న ఉప్పులో అయోడిన్ శాతం ఎంత ఉందో తెలుసుకోవాలి.. అప్పుడే ఆ ఉప్పును వాడటం చేయాలి.

ఇంతకీ మన వంటింట్లో వాడేది అయోడిన్ ఉప్పునా? లేదా మూమాలు ఉప్పు అవునో కాదో తెలుసుకుందాం.. అయోడిన్ ఉప్పు (salt iodine test kit) గురించి తెలుసుకోవాలంటే ఎక్కడికో వెళ్లక్కర్లేదు. ఈ రెమడీ చాలు. (FSSAI) రిలీజ్ చేసిన వీడియోను పరిశీలిస్తే.. మీకే తెలుస్తుంది. ఆలుగడ్డను తీసుకోండి.. అదేనండీ బంగాళదుంపను 2 ముక్కలుగా కోయాలి. మీ ఇంట్లో ఉప్పును బంగాళ దుంప ముక్కలపై చల్లండి. రెండు చుక్కల నిమ్మ రసాన్ని (Lemon Juice) ఆ ఆలు ముక్కల మీద పిండండి. వెంటనే ఆలు ముక్క రంగు మారని యెడల అందులో కల్తీ లేదని గుర్తించవచ్చు.

ఒకవేళ ఆలు ముక్క నీలిరంగులోకి మారినట్టయితే మాత్రం కచ్చితంగా ఆ ఉప్పులో కల్తీ జరిగిందని గుర్తించాలి. ఇంకెందుకు ఆలస్యం.. మీ వంటింట్లో ఉప్పులో అయోడిన్ ఉందో లేదో వెంటనే ఈ ప్రయోగం ద్వారా తెలుసుకోండి. ప్రస్తుత మార్కెట్లో లభించే ఉప్పులో ఎంతవరకు అసలైనదో తెలుసుకోవడం కష్టంగా ఉంది. కల్తీ ఉప్పుకు అసలైన ఉప్పుకు తేడా పెద్దగా కనిపించడం లేదు. అందుకే కల్తీ ఉప్పు ఏదో.. మంచి ఉప్పు ఏదో గుర్తు పట్టలేరు. అందుకే ఉప్పు అనేది అసలైనదో కాదో కల్తీదో తెలుసుకోవాలంటే పైన చెప్పిన విధంగా ఉప్పు కల్తీ పరీక్ష చేయడం ద్వారా మనం వాడే ఉప్పు మంచిదో కాదో వెంటనే తెలుసుకోవచ్చు. మీరు కూడా ఓసారి ట్రై చేయండి..

Read Also :
 Negative Energy Bathroom : మీ ఇంట్లో సమస్యలా.. బాత్‌రూమ్స్‌‌‌లో నెగటివ్ ఎనర్జీని తొలగించుకోండిలా..

The post Iodine Salt Test Telugu : మీరు వాడే ఉప్పులో అయోడిన్ ఉందా? అది కల్తీనా కాదో ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు.. కచ్చితమైన రిజల్ట్స్..! appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
https://mearogyam.com/kitchen-remedies/iodine-salt-test-telugu-how-to-test-iodine-in-salt-at-home-telugu.html/feed 0